Preity Zinta Supports Shreyas Iyer: ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటించిన నాటి నుంచి సోషల్ మీడియాలో యుద్ధమే జరుగుతుంది. సిరాజ్, జైస్వాల్, అయ్యర్, రాహుల్ కు ఈ టోర్నీలో అవకాశం రాలేదు. అంతంతమాత్రంగా ప్రతిభ చూపించిన హర్షిత్ రాణా వంటి ఆటగాడికి అవకాశం ఇచ్చినప్పుడు.. అయ్యర్, సిరాజ్, జైస్వాల్, రాహుల్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని సోషల్ మీడియాలో అభిమానులు భారత క్రికెట్ నియంత్రణ మండలి, శిక్షకుడు గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్ ను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు.
Also Read: విశాఖకు కేంద్రం గుడ్ న్యూస్!
మిగతా వారేమో గాని అయ్యర్ విషయంలో సోషల్ మీడియాలో ఒక యుద్ధమే జరుగుతోంది. అతడికి సపోర్ట్ గా వేలాది ట్వీట్లు, పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయ్యర్ విషయంలో మేనేజ్మెంట్ ఆడుకుంటున్నదని.. అతడికి అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు కల్పించడంలో విఫలమవుతోందని.. దీనంతటికీ గంభీర్ కారణమని అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అతడు ఇటీవలి టోర్నీలలో అద్భుతమైన ప్రతిభ చూపించినప్పటికీ ఎందుకు జట్టులో చోటు కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఆటగాడు ఇతర జట్టులో గనుక ఉండి ఉంటే కచ్చితంగా తీసుకునేవారని.. వరుసగా అవకాశాలు కల్పించేవారని కామెంట్లు చేస్తున్నారు.
ఇక అయ్యర్ కోసం పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా రంగంలోకి దిగింది. అయితే నేరుగా ఆమె మాట్లాడక పోయినప్పటికీ తన పంజాబ్ జట్టు అధికారిక సోషల్ మీడియా ద్వారా అయ్యర్ కు అనుకూలంగా ఒక పోస్ట్ చేయించింది. అందులో “జరుగుతున్న విధానం మీద నమ్మకం ఉందని” అని అర్థం వచ్చేలాగా కొటేషన్ రూపొందించింది. అంతేకాదు మైదానంలో ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధంగా ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసింది.. అయితే పంజాబ్ జట్టు సోషల్ మీడియా విభాగాలను ప్రీతి పర్యవేక్షిస్తుంటారు. ప్రీతి సహ యజమానిగా ఉన్న జట్టును ఇటీవలి ఐపిఎల్ లో అయ్యర్ తుది పోరు వరకు తీసుకెళ్లాడు. కన్నడ జట్టు చేతిలో ఓటమిపాలైనప్పటికీ.. తన జట్టుకు తిరుగులేని గౌరవాన్ని అందించాడు. అందువల్లే అయ్యర్ అంటే ప్రీతికి విపరీతమైన నమ్మకం. భారత జట్టులో అతడికి చోటు లభించకపోవడం పట్ల ఆమె బాధపడినప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకుని నిర్ణయం పట్ల తమకు నమ్మకం ఉంది అని అర్థం వచ్చేలా ఒక ట్వీట్ చేశారు.. వాస్తవానికి ఐపిఎల్ లో తమ జట్టుకు ఆడిన ఆటగాళ్లపట్ల యాజమాన్యాలు ఈ స్థాయిలో అఫెక్షన్ చూపించవు. ఒకవేళ ప్లేయర్లు ఏమైనా అద్భుతమైన రికార్డులు సృష్టిస్తే తప్ప వారి గురించి ప్రస్తావించవు. అయితే అయ్యర్ కు జాతీయ జట్టులో చోటు లభించకపోవడం పట్ల పంజాబ్ యాజమాన్యం తీవ్రంగా కలత చెందుతున్నది. ఆ బాధను పరోక్షంగా బయట పెట్టింది. దీని వెనుక ఉన్నది ప్రీతి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
PUNJAB KINGS POSTER FOR SHREYAS IYER
– “Trust the Process”. pic.twitter.com/2QEu2K8m0M
— Johns. (@CricCrazyJohns) August 20, 2025