Homeఎంటర్టైన్మెంట్పవన్ కోసం భక్తుడు కథా తాపత్రయం !

పవన్ కోసం భక్తుడు కథా తాపత్రయం !

పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు తాను పరమభక్తుడిని అని సగర్వంగా చాటి చెప్పుకునే నిర్మాత బండ్ల గ‌ణేష్, ప్రస్తుతం పవర్ స్టార్ కోసం కథను వెతికే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. బండ్ల గణేష్ కి ఇప్పటికే పవన్ డేట్స్ ఇస్తానని చెప్పడంతో.. బండ్ల సీరియస్‌ గా కథల పై పడ్డాడు. బండ్ల కథ వెతికే క్రమంలో ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులు, రైటర్స్‌ ను కలుస్తున్నాడట. అయినా పవన్ ఇమేజ్‌ కు సరిపోయే కథను […]

Pawan Kalyanపవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు తాను పరమభక్తుడిని అని సగర్వంగా చాటి చెప్పుకునే నిర్మాత బండ్ల గ‌ణేష్, ప్రస్తుతం పవర్ స్టార్ కోసం కథను వెతికే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. బండ్ల గణేష్ కి ఇప్పటికే పవన్ డేట్స్ ఇస్తానని చెప్పడంతో.. బండ్ల సీరియస్‌ గా కథల పై పడ్డాడు. బండ్ల కథ వెతికే క్రమంలో ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులు, రైటర్స్‌ ను కలుస్తున్నాడట.

అయినా పవన్ ఇమేజ్‌ కు సరిపోయే కథను మాత్రం ఎవరూ చెప్పట్లేదట. అందుకే, పవన్ కి సరిపోయే కథను సిద్ధం చేయండి అంటూ రచయితలను దర్శకులను రిక్వెస్ట్ చేస్తున్నాడు బండ్ల గణేష్. కథ ఫైనల్ అయిన తర్వాత.. ఇక పవన్ తో చేయబోయే సినిమా వివరాలు బయటికి చెప్తానంటున్నాడు బండ్ల గణేష్. నిజానికి ఆ మధ్య ఓ తమిళ యువ రచయిత జాన్ అనే అతని దగ్గర, బండ్ల ఒక కథను ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి.

జాన్ కథను పవన్ కోసం సెట్ చేయాలని బండ్ల ప్లాన్ చేశాడు. కథలో పవన్ పాత్ర చాల కొత్తగా ఉంటుందని.. కాలేజీ లెక్చరర్ గా పవన్ సినిమాలో కనిపిస్తారని.. పవన్ కి జాన్ కథ నచ్చుతుందని బండ్ల తన సన్నిహితుల దగ్గర చెప్పుకొచ్చాడు కాలేజీ నేపథ్యంలో సినిమా కాబట్టి, పవన్ ది కూడా లెక్చరర్ పాత్ర కాబట్టి.. సమాజం పై, సూక్తులు గట్రా బాగానే పెట్టుకోవచ్చు.

పవన్ రాజకీయాలకు కూడా ఈ కథ పనికొస్తోంది. కానీ ఎందుకో ఈ కథ గురించి ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత పవన్ కోసం బండ్ల కథలు వింటున్నాడు అని వార్తలు వచ్చాయి. ఇప్పటికే బండ్ల ఓ స్టార్ డైరెక్టర్ ను కూడా సంప్రదించాడని.. ఎలాగూ కాంబినేషన్ లను సెట్ చేసి.. సినిమాలను తీయడంలో బండ్లకు బాగా తెలిసిన విద్య.

పైగా పవన్ కళ్యాణ్ హీరో.. ఏ స్టార్ డైరెక్టర్ అయినా డేట్స్ ఎడ్జెస్ట్ చేసి మరీ సినిమా చేయడానికి తెగ ఉత్సాహపడుతూ ఉంటాడు. బండ్ల ప్లాన్ ప్రకారం ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ – పరుశురామ్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేసాడట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper