Balakrishna: బాలకృష్ణ ముక్కోపి. పబ్లిక్ లో ఆయన ప్రవర్తన పలుమార్లు వివాదాస్పదమైంది. ప్రేమతో దగ్గరకు వెళ్లిన అభిమానులను బాలకృష్ణ పలుమార్లు కొట్టాడు. వారిపై చేయి చేసుకున్నాడు. బాలయ్య పక్కన ఉంటే ప్రముఖులు కూడా బయటపడతారు. ఎప్పుడు? ఎలా? ఆయన మూడ్ మారుతుందో చెప్పలేం. ఇటీవల బాలకృష్ణ హీరోయిన్ అంజలితో ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అయ్యింది. ఫోటోకి ఫోజు ఇచ్చే క్రమంలో అంజలితో దురుసుగా ప్రవర్తించాడు. ఇది నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది.
బాలయ్యపై విమర్శలను తగ్గించేందుకు అంజలి ట్వీట్ చేసింది. మా మధ్య ఉన్న అనుబంధం రీత్యా బాలకృష్ణ నాతో అలా ప్రవర్తించాడు. నన్ను అవమానించాలనే ఉద్దేశం ఆయనకు లేదంటూ అంజలి వివరణ ఇచ్చింది. కాగా బాలకృష్ణ పుష్ప 2 సెట్స్ కి ఏకంగా కత్తి తీసుకుని వెళ్ళాడట. దర్శకుడు సుకుమార్ ని బెదిరించాడట. అందుకు కారణం ఏమిటంటే..
బాలయ్య ఓ యాడ్ షూట్ చేస్తున్నాడట. అదే స్టూడియోలో పుష్ప 2 షూటింగ్ జరుగుతుందట. షాట్ గ్యాప్ లో బాలయ్యకు బోర్ కొట్టడంతో పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న సంగతి తెలుకుని.. అక్కడకు వెళ్ళాడట. వెళుతూ వెళుతూ ఓ కత్తిని చొక్కాలో పెట్టుకుని వెళ్ళాడట. బాలయ్య సడన్ ఎంట్రీని చూసి అల్లు అర్జున్ లేచి వెళ్లి విష్ చేశాడట. హాయ్ సర్.. అన్నాడట. సర్ కాదు బ్రో అని పిలవాలని అల్లు అర్జున్ కి బాలయ్య సూచించాడట.
దాంతో బాలయ్యను అల్లు అర్జున్ బ్రో అని పిలిచాడట. అనంతరం పలకరించేందుకు సుకుమార్ దగ్గరకు రాబోతుండగా… కత్తి తీశాడట బాలయ్య. దాంతో సుకుమార్, అల్లు అర్జున్ షాక్ అయ్యారట. నాతో మూడు నెలల్లో సినిమా తీస్తాను అన్నావు. ఇంత వరకు ఏం లేదు. ఎప్పుడు చేస్తావ్ సినిమా.. అంటూ కత్తితో సుకుమార్ ని బెదిరించాడట. ఇదంతా హాస్యం కోసమని తెలుసుకున్న సుకుమార్, అల్లు అర్జున్ ఊపిరి పీల్చుకున్నారట.
అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చిన సుకుమార్ హోస్ట్ బాలయ్యకు హామీ ఇచ్చాడు. అదే విషయాన్ని బాలకృష్ణ తనదైన శైలిలో గుర్తు చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు బాబీతో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కానుందని సమాచారం.
Web Title: Balakrishna threatened sukumar with a knife on the set of pushpa 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com