Homeఎంటర్టైన్మెంట్Balakrishna Strict On Budget: బాలయ్య ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడా..?

Balakrishna Strict On Budget: బాలయ్య ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడా..?

Balakrishna Strict On Budget: నందమూరి నటసింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు మాస్ కమర్షియల్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు ఫుల్ పండుగనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మాస్ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా బీ,సీ సెంటర్లో ఆయనకు భారీ క్రేజ్ అయితే ఉంది. మరి అలాంటి హీరో నుంచి సినిమా రావడం అనేది ప్రేక్షకులు కూడా ఆనందపడే విషయమనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలోనే బాలయ్య బాబు ఇప్పుడు […]

Balakrishna Strict On Budget: నందమూరి నటసింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు మాస్ కమర్షియల్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు ఫుల్ పండుగనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మాస్ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా బీ,సీ సెంటర్లో ఆయనకు భారీ క్రేజ్ అయితే ఉంది. మరి అలాంటి హీరో నుంచి సినిమా రావడం అనేది ప్రేక్షకులు కూడా ఆనందపడే విషయమనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలోనే బాలయ్య బాబు ఇప్పుడు కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడట. ముఖ్యంగా ఒక విషయంలో మాత్రం ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే సినిమా బడ్జెట్ అసలు పెరగకూడదనే ఉద్దేశ్యంతో ఆలోచిస్తున్నారట. దర్శకులు ముందుగానే సినిమా బడ్జెట్ విషయంలో ఒక క్లారిటిని మెయింటైన్ చేస్తూ బడ్జెట్ షీట్ ని కూడా రెడీ చేసిన తర్వాతే తను సినిమాను రంగంలోకి దింపుతున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే తన వల్ల ఏ ప్రొడ్యూసర్ కూడా నష్టపోకూడదనే ఆలోచనలో బాలయ్య ఉన్నాడు. సినిమా యావరేజ్ అయిన లేదంటే ప్లాప్ అయిన కూడా ప్రొడ్యూసర్ కు మినిమం గ్యారంటి వసూళ్లు వచ్చే విధంగా సినిమాను తీర్చిదిద్దాలని దర్శకులకు ముందుగానే చెబుతున్నాడట.

ఇక బడ్జెట్ కూడా ఓవర్ గా ఉండకూడదని తన మార్కెట్ పరిధిలోనే బడ్జెట్ ఉండాలని అన్నారట. దీనివల్ల ప్రొడ్యూసర్లు కూడా బాలయ్య బాబుతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికైతే బాలయ్య సినిమా ఫ్లాప్ అయినా కూడా నష్టాలు పెద్దగా రాకుండా ఉండే విధంగానే ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

తను ఏది ఏమైనా కూడా బాలయ్య భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన ‘అఖండ 2’ సినిమాతో ఆయన ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఇక ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తూ బడ్జెట్ ను తగ్గిస్తూ కంటెంట్ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా బెస్ట్ కథలను రియలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper