‘Akhanda 2’ Teaser : నేడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం ‘అఖండ 2′(Akhanda 2 Movie) నుండి నిన్న సాయంత్రం మేకర్స్ టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులకు బాగా నచ్చింది కానీ, మామూలు మూవీ లవర్స్ మాత్రం ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. హిందీ యూట్యూబర్స్ రియాక్షన్ వీడియోస్ లో ఈ టీజర్ లో వచ్చే త్రిసూలం షాట్ కి పగలబడి నవ్వుకున్నారు. ఏది ఏమైనా ఈ టీజర్ పై ప్రశంసలు ఏ రేంజ్ లో అయితే వచ్చాయో, ట్రోల్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. పెద్ద సెన్సేషనల్ టాపిక్ అవ్వడంతో యూట్యూబ్ లో వ్యూస్ కూడా అదిరిపోయాయి. కేవలం 15 గంటల్లోనే ఈ టీజర్ కి కోటికి పైగా వ్యూస్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అంతే కాదు లైక్స్ కూడా దాదాపుగా 3 లక్షల 82 వేలు వచ్చాయి. ఈ రేంజ్ లో ఈమధ్య కాలంలో ఒక టీజర్ కి రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 24 గంటలు ముగిసేసరికి కచ్చితంగా ఈ టీజర్ కి రెండు కోట్లకు పైగా వ్యూస్, 5 లక్షలకు పైగా లైక్స్ వస్తాయని ఆశిస్తున్నారు అభిమానులు. ఈ రేంజ్ లైక్స్ మహేష్ బాబు సినిమాలకు కూడా ఈమధ్య కాలం లో రాలేదని,ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ని చూస్తుంటే ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు విశ్లేషకులు. ‘అఖండ’ చిత్రాన్ని కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు,యూత్,ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎగబడి చూసారు. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే కచ్చితంగా అన్ని వర్గాల్లో సమానమైన ఆదరణ ఉంటుంది. కాబట్టి ఈ చిత్రానికి నేటి తరం స్టార్ హీరోల పాన్ ఇండియన్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓపెనింగ్ వసూళ్లు వస్తాయని రానున్నారు విశ్లేషకులు. ఈ ఏడాది సెప్టెంబర్ 25 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. కానీ ఈ చిత్రం డిసెంబర్ కి వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.