Bigg Boss 10 Telugu: గత సీజన్ తో పోలిస్తే , ఈ బిగ్ బాస్ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. గత సీజన్ లో ఇమ్మానుయేల్ , తనూజ, భరణి , రీతూ చౌదరి మధ్య జరిగే సంభాషణలు చాలా ఫన్నీ గా , ఆర్గానిక్ కామెడీ తో అదిరిపోయేవి. ఈ సీజన్ లో ఆటో రామ్ ప్రసాద్ , నరేష్ వంటి టాప్ మోస్ట్ కమెడియన్స్ ఉన్నప్పటికీ కూడా గత సీజన్ రేంజ్ ఫన్ అసలు జెనరేట్ అవ్వడం లేదు. కమెడియన్స్ కి ఉన్న లక్షణం పంచులు. ముఖ్యంగా ఆటో రామ్ ప్రసాద్ పంచులు అయితే వేరే లెవెల్ లో ఉంటాయి. ఆ పంచులు ఆయనకు అనేక చిక్కు తెచ్చిపెడతాయి చూడండి అంటూ సోషల్ మీడియా లో అప్పట్లో కొంతమంది విశ్లేషకులు అంచనా వేశారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే రామ్ ప్రసాద్ పంచులు ఇప్పుడు ఆయనకు సరికొత్త తలనొప్పులు తీసుకొచ్చాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే మొన్న షాలిని పెద్ది చిత్రం లోని ‘వారానికి వెయ్యి’ అంటూ పాడిన పాటకు , రామ్ ప్రసాద్ కౌంటర్ ఇస్తూ ‘వారానికి వెయ్యి చాలా ఎక్కువ’ అని అంటాడు. ఈ పంచ్ కి షాలిని బాగా హర్ట్ అయ్యింది. దీనిపై అప్పుడు స్పందించలేకపోయింది కానీ, నిన్న సందర్భం రావడం తో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ , మీరు కామెడీ అనుకొని కొన్ని కొన్ని మాటలు వదిలేస్తున్నారు, అది చాలా వల్గర్ గా అనిపిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చింది. దీనికి ఆటో రామ్ ప్రసాద్ బాగా హర్ట్ అయిపోయాడు. మీకు ఏదైనా జోక్ నచ్చకపోతే వెంటనే అక్కడే చెప్పేయండి. దాన్ని మీ మనసులో పెట్టుకొని నామినేషన్స్ పాయింట్స్ లాగా చెప్పడం చాలా అన్యాయం, ఇది కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు రామ్, ప్రసాద్. రామ్ ప్రసాద్ మాట్లాడిన మాటల్లో కూడా లాజిక్ ఉంది, అదే సమయం లో షాలిని హర్ట్ అవ్వడం లో కూడా తప్పు లేదు.
రామ్ ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా ఆ మాట అనకపోయినప్పటికీ, అది చాలా వల్గర్ కామెంట్ అనే చెప్పాలి. వేరే అమ్మాయి అయ్యుంటే పెద్ద రచ్చ చేసేది. షాలిని కాబట్టి పరిస్థితి ని అర్థం చేసుకొని , మీరు కామెడీ చేస్తుంటారు కాబట్టి , అప్పుడప్పుడు ఇలాంటి పంచులు సహజంగానే వస్తుంటాయి, అది నేను అర్థం చేసుకోగలను, కానీ కోట్లాది మంది వీక్షిస్తున్న షో కదా, కాస్త కొన్ని పంచులు వదిలే ముందు చూసుకోండి అని చెప్పి వదిలేసింది. షాలిని మాట్లాడిన మాటలకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.