Homeఎంటర్టైన్మెంట్Anushka Shetty Kathanar Trailer Review: అనుష్క 'కథనార్' ట్రైలర్ రివ్యూ : విజువల్స్ అదిరాయి.....

Anushka Shetty Kathanar Trailer Review: అనుష్క ‘కథనార్’ ట్రైలర్ రివ్యూ : విజువల్స్ అదిరాయి.. కానీ స్టోరీ గందరగోళం..

Anushka Shetty Kathanar Trailer Review: చాలా ఏళ్ళ నుండి సెట్స్ మీదున్న అనుష్క శెట్టి(Anushka Shetty) భారీ గ్రాండియర్ చిత్రం ‘కథనార్'(Kathanar Movie). మలయాళం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అక్కడి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రం లో హీరో గా జయ సూర్య నటించాడు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని తెలుగు , హిందీ , మలయాళం మరియు ఇతర ప్రాంతీయ […]

Anushka Shetty Kathanar Trailer Review: చాలా ఏళ్ళ నుండి సెట్స్ మీదున్న అనుష్క శెట్టి(Anushka Shetty) భారీ గ్రాండియర్ చిత్రం ‘కథనార్'(Kathanar Movie). మలయాళం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అక్కడి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రం లో హీరో గా జయ సూర్య నటించాడు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని తెలుగు , హిందీ , మలయాళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లోని విజువల్స్ నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఇలాంటి స్టోరీలను ఆడియన్స్ చూడడం ఎప్పుడో మానేశారు. మోహన్ లాల్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇలాంటి జానర్ సినిమాల్లో నటిస్తేనే చూడలేదు, ఇక ఈ సినిమాని ఎవరు చూస్తారు చెప్పండి. కనీసం స్టోరీ అయినా మంచి ఫ్లో లో ఉండుంటే కచ్చితంగా ఆడియన్స్ చూస్తారు.

కానీ ట్రైలర్ చూస్తుంటే అలా అనిపించడం లేదు. విజ్ఞానం రూపం ఎలా ఉన్న , కాంతాల్లోర్ శాలలో దానిని ఆహ్వానిస్తారు, ఇంద్రజాలాన్ని నేను నమ్మను అంటూ ఆరంభం లోని కాంప్లెక్స్ స్టోరీ టెల్లింగ్ తో చెప్పడం వల్ల , ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. తెలుగు లో డైలాగ్ రైటింగ్ సరిగా రాయలేదో, మిగిలిన భాషల్లో అది వర్కౌట్ అయ్యిందో లేదో తెలియదు కానీ, ఎదో ఒక కొత్త ప్రపంచాన్ని డైరెక్టర్ ఆడియన్స్ కి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అని మాత్రం అర్థం అవుతోంది. అంతే కాదు ట్రైలర్ లో అనుష్క కి సంబంధించిన షాట్స్ , ఆఫ్ విధంగా హీరో జయసూర్య కి సంబంధించిన షాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువ శాతం స్టోరీ ని వివరించే ప్రయత్నం చేశారు, అదే ఆకర్షనీయంగా లేదు ఇలాగే సినిమా ఉంటే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ చిత్రం లో ప్రభుదేవా , శాండీ మాస్టర్, సీనియర్ హీరో వినీత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం లో అనుష్క విలన్ క్యారెక్టర్ లో నటించిందని ప్రచారం జరిగింది. కానీ ట్రైలర్ లో మాత్రం అలాంటి ఛాయలు అసలు కనిపించడం లేదు. మూడేళ్ళ నుండి సెట్స్ మీద ఉంది ఈ చిత్రం. కానీ అనుష్క లుక్ ని చూస్తుంటే ఆమెకు సంబంధించిన సన్నివేశాలు రీసెంట్ గానే షూట్ చేసినట్టు అనిపిస్తోంది. ఓవరాల్ ట్రైలర్ లో విజువల్స్ తప్ప, మిగిలిన ప్లాట్ మొత్తాన్ని చూస్తుంటే డిజాస్టర్ కల ఉట్టిపడుతోంది. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper