spot_img
Homeఎంటర్టైన్మెంట్Ante Sundaraniki Collections: అక్కడ హిట్ ఇక్కడ ఫట్... అంటే సుందరానికీ మిక్స్డ్ రిజల్ట్!

Ante Sundaraniki Collections: అక్కడ హిట్ ఇక్కడ ఫట్… అంటే సుందరానికీ మిక్స్డ్ రిజల్ట్!

Ante Sundaraniki Collections: హీరో నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ. కామెడీ రొమాంటిక్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ దక్కించుకున్న అంటే సుందరానికీ … కలెక్షన్స్ పరంగా నిరాశపరిచింది. మొదటి వారం ముగిసే నాటికి అంటే సుందరానికీ రూ. 18 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 31 కోట్లు రాబట్టాలి. దారుణమైన ఓపెనింగ్స్ దక్కించుకున్న అంటే సుందరానికీ మండే తర్వాత మరింత డల్ అయ్యింది. నాలుగో రోజు నుండి భారీ డ్రాప్ కనిపించింది.

Ante Sundaraniki Collections
Ante Sundaraniki Collections

ఇక ఏపీ/తెలంగాణాలో కలిపి ఫస్ట్ వీక్ అంటే సుందరానికీ రూ. 11.63 కోట్ల షేర్, 19.25 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 50 శాతం కూడా రికవరీ సాధించలేదు. ఇక నేడు కొత్త సినిమాల విడుదలతో అంటే సుందరానికీ వసూళ్ళు మరింత తగ్గనున్నాయి. నైజాంలో రూ. 10 కోట్లకు అమ్మితే వచ్చింది మాత్రం ఐదు కోట్లు. మొత్తంగా ఏపీ/ తెలంగాణాలో అంటే సుందరానికీ డిజాస్టర్ అని చెప్పాలి. అయితే ఈ మూవీ ఓవర్సీస్ లో హిట్ కావడం విశేషం.

Also Read: Virata Parvam Collections: విరాట పర్వం మొదటి రోజు వసూళ్లు..ఎవ్వరు ఊహించని అద్భుతం ఇది

నానికి యూఎస్ లో మంచి మార్కెట్ ఉంది. అంటే సుందరానికీ యూఎస్ కలెక్షన్స్ మెరుగ్గా ఉన్నాయి. వన్ మిలియన్ వసూళ్లు దాటేసిన ఈ చిత్రం ఓవర్సీస్ లో రూ. 5.05 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన అంటే సుందరానికీ లాభాలు పంచుతుంది. డొమెస్టిక్ గా ఫెయిల్ అయిన అంటే సుందరానికీ ఓవర్సీస్ లో హిట్ సొంతం చేసుకొని నానికి ఊరటనిచ్చింది. ఆ విధంగా అంటే సుందరానికీ నిర్మాతలకు మిక్స్డ్ రిజల్ట్ అందించింది.

Ante Sundaraniki Collections
Ante Sundaraniki Collections

బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ అంటే సుందరానికీ చిత్రం తెరకెక్కించారు. నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా వివేక్ సాగర్ సంగీతం అందించారు. రోహిణి, నరేష్, నదియా కీలక రోల్స్ చేశారు. జూన్ 10న అంటే సుందరానికీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రస్తుతం నాని దసరా మూవీలో నటిస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్. అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఫేమ్ మున్నాతో ఓ మూవీకి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read:Renuka Chowdhury: రేణుకా చౌదరి నోటికి, చెయ్యికి ఎప్పుడూ పదునే

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper