Devara: ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ఆయన భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఇంతకుముందు త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీయార్ కి ఏమాత్రం గుర్తింపు అయితే రాలేదు. అందుకే ఈ సినిమాతో భారీ గుర్తింపు సంపాదించుకోవాలని అలాగే భారీ కలెక్షన్లను కూడా రాబట్టాలని చూస్తున్నాడు.
మరి ఇలాంటి క్రమంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ఎలాంటి టాక్ ని తెచ్చుకుంటుంది అనేది మాత్రం ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే అందరూ స్టార్ హీరోలు వరుసగా పెద్ద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఎన్టీఆర్ మాత్రం ఇంకా సోలోగా 200 కోట్ల మార్క్ ని కూడా దాటలేకపోయాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో 1200 కోట్లు వచ్చినప్పటికీ అందులో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురికి వాటా ఉంటుంది. ఈ ముగ్గురి స్టార్ డమ్ వల్లే ఆ సినిమా ఆ రేంజ్ లో కలెక్షన్లను వసూలు చేసింది అనేది వాస్తవం.కాబట్టి ఇప్పుడు సోలో హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశమైతే వచ్చింది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ లీక్ అయిందంటు సోషల్ మీడియా మొత్తం ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఇక ఆ డైలాగ్ ఏంటంటే ఫైట్ జరిగే క్రమం లో ఎన్టీయార్ రౌడీలను కొడుతూ ‘నా బాడీలో నుంచి వచ్చే ఈ రక్తం మీద ఒట్టు ఇప్పుడు మిమ్మల్ని చంపి సముద్రం లో చేపలకు ఎర లా వేయకపోతే, ఈ ఉప్పొంగే సముద్రం లోనే నేను కలిసిపోతా రండ్రా నా కొడకల్లరా’ అంటూ ఈ డైలాగ్ సాగుతుందట. ఈ డైలాగ్ వింటేనే మనకు రక్తం మరుగుతుంది, ఇక రేపు థియేటర్ లో చూస్తే పూనకాలు పక్క అని ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొడితే ఎన్టీఆర్ కూడా స్టార్ హీరోల రేంజ్ లో దూసుకు పోతాడు.ఒకవేళ ఈ సినిమా కనక ఏదైనా తేడా కొడితే మాత్రం ఎన్టీఆర్ కెరియర్ భారీ గా నష్టపోవాల్సి వస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా మీద ఎన్టీఆర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఇది పూర్తి అయ్యేంతవరకు ఇంకో కొత్త సినిమాకి కూడా కమిట్ అవ్వకూడదని తను ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.
మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమాతో సక్సెస్ వస్తుందా లేదా అనేది చూడాలి. ఇక కొరటాల శివ ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ అనే సినిమా చేసి ఆయనకి మంచి సక్సెస్ ని అందించాడు. ఇక అదే విధంగా ఈ సినిమాతో కూడా ఒక మంచి సక్సెస్ ని ఇస్తాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…