Prabhas Hanu Raghavapudi: ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ప్రభాస్ కి ఉన్న గుర్తింపు కంప్లీట్ వేరు అనే చెప్పాలి. ప్రభాస్ మొదటి నుంచి కూడా ప్రతి సినిమాలో వైవిధ్యమైనటువంటి నటనని కనబరుస్తూ ప్రేక్షకులను, తన అభిమానులని ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తు వస్తున్నాడు.ఇక పాన్ ఇండియా రేంజ్ లో మొదటి సక్సెస్ ని అందుకున్న హీరో కూడా ప్రభాస్ కావడం విశేషం…
ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఇప్పటికే ఆయన చేసిన సలార్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో ప్రభాస్ స్టార్ డమ్ అనేది మరొకసారి భారీ రేంజ్ లో విస్తరించింది. ఇక ఇప్పుడు ఆయన కల్కి, రాజాసాబ్ లాంటి సినిమాలు చేస్తున్నాడు. ఇక వీటితో పాటుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాల తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో మరొక సినిమా కూడా చేయబోతున్నాడు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ‘సీతరామం’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న హను రాఘవపూడి ఇప్పటికే ప్రభాస్ ని కలిసి ఆయనకు ఒక మంచి స్క్రిప్ట్ ని వినిపించినట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా ఒక లవ్ స్టోరీ కావడంతో ప్రభాస్ అందులో సెట్ అవుతాడా లేదా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగానే హను రాఘవపూడి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ని ప్రభాస్ తో చేయబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటి అంటే ఇది ఒక రాజుల కాలం నాటి సినిమా గా తెలుస్తుంది. అందులోనే ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ని కలిపి దర్శకుడు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఈ లవ్ స్టోరీ లో ప్రభాస్ సెట్ అవుతాడా అనే వార్తలైతే వస్తున్నాయి. కానీ డైరెక్టర్ మాత్రం ఈ స్క్రిప్ట్ మీద భారీ నమ్మకంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ప్రభాస్ ని ఈ సినిమాలో కొత్తగా చూపించాలానే కాన్ఫిడెంట్ తో డైరెక్టర్ ఉన్నాడు. ఇక అతని కాన్ఫిడెంట్ చూసిన ప్రభాస్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది…