Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగిన సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. వీళ్ళ కాంబో లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక దానికి ఫ్రాంచైజ్ గా వస్తున్న పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.
ఇక మొదటి పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. క్రికెటర్లు, సెలబ్రిటీలు సైతం పుష్ప సినిమా సాంగ్స్ మీద రీల్స్ చేస్తూ విపరీతమైన హైప్ ని క్రియేట్ చేశారు. ఇక పుష్ప సినిమాతో వచ్చిన ఇమేజ్ ని మరొకసారి వాడుకోవాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ సినిమా పార్ట్ 2 కూడా ని రంగంలోకి దింపారు. ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ మరొక రేంజ్ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పుష్ప సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడితే పుష్ప 2 సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నాడు. మరి ఇలాంటి క్రమంలో అటు సుకుమార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరూ కూడా పుష్ప 2 సినిమా ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా లో గంగమ్మ తల్లి ఫైట్ ని హైలెట్ గా చిత్రీకరించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ ఫైట్ షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీ లో పూర్తి అయినప్పటికీ ఈ సినిమాలో హైలెట్ అయ్యే ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఫైట్ సీక్వెన్స్ మాత్రమే అని సినిమా యూనిట్ మొత్తం బల్ల గుద్ది చెబుతున్నారు. ఇక ఈ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ ని చూస్తే ఆయన నటన ముందు నేషనల్ అవార్డు కూడా చాలా చిన్నది అవుతుంది అంటూ చిత్ర యూనిట్ వాళ్ళ కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ ఈ సినిమాలో మరింత రెచ్చిపోయి నటించినట్టు గా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక పుష్ప సినిమాతో ఒక నేషనల్ అవార్డుని తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 తో మరెన్ని అద్భుతాలను క్రియేట్ చేస్తాడో చూడాలి…