Anchor Anasuya: జబర్దస్త్ వ్యాఖ్యాత, బుల్లితెర, వెండితెర నటి అనసూయ గురించి పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆమెకు అభిమానులుండటం తెలిసిందే. తన అందం, అభినయంతో అందరిని మైమరపిస్తోంది. పొట్టి పొట్టి డ్రెస్సులతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. తన హాట్ ఫొటోలు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. తన అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ లలో ఫొటోలు పోస్టులు పెడుతూ అభిమానులతో మాట్లాడుతుంది. వారితో అన్ని విషయాలు చర్చిస్తూ ముచ్చటిస్తుంది.

వెండితెరలో కూడా అనసూయ బిజీగా ఉంటోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా ప్రేక్షకులను మెప్పించింది. పుష్పలో దాక్షాయణిగా కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఇక పుష్ప2లో కూడా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తోంది. దర్జా సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. కృష్ణవంశీ తీసే రంగమార్తాండ సినిమాలో కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అటు బుల్లితెరలోనూ తన హవా కొనసాగిస్తోంది. జబర్దస్త్ లో వ్యాఖ్యాతగా ఎంతో పేరు తెచ్చుకున్న అనసూయ స్టార్ మాలో కూడా పలు షోల్లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తోంది.
తాజాగా స్టార్ మాలో జరిగిన షోల్లో పొట్టి పొట్టి డ్రెస్సులతో డ్యాన్సులు చేస్తూ అదరగొడుతోంది. తొడలు కనిపించేలా డ్రెస్ వేసుకుని నాట్యం చేస్తూ అందరిని రెచ్చగొడుతోంది. ఆమె వేసిన స్టెప్పులకు అందరు ఫిదా అవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమె డ్యాన్స్ వైరల్ అవుతోంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా డ్రెస్సులు వేస్తూ అందరిని తన వైపు తిప్పుకుంటోంది. మత్తెక్కించే అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. చీరకట్టులో కూడా ఒంపుసొంపులు కనిపించేలా చేస్తూ అందరిలో ఉత్సాహం నింపుతోంది.
అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తన హాట్ ఫొటోలు పోస్టులు చేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అనసూయ బుల్లితెర, వెండితెరల్లో నటిస్తూ తనదైన ముద్ర వేస్తోంది. నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనసూయకు అభిమానులుండటం విశేషం. సామాజిక మాధ్యమాల్లో తన లేటెస్ట్ ఫొటోలు పెడుతుంటుంది. వారితో తన అనుభవాలు పంచుకుంటుంది.