Woman Traping: ఒంటరిగా ఉండే మహిళలపై మృగాళ్ల కన్ను పడుతూనే ఉంటుంది. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని వారిని అన్ని విధాలా వాడుకుని వదిలేయడం చాలా సంఘటనల్లో చూస్తుంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ మహిళ భర్తతో విడిపోయి బిడ్డతో కలిసి ఉంటోంది. దీంతో ఆమెను లోబరుచుకోవాలని ఓ మగాడు ప్రయత్నించాడు. మాయమాటలు చెప్పి వశం చేసుకున్నాడు. ఆమెతో శారీరక సంబంధం కొనసాగించాడు. ఆరునెలలు గడిచాక పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు.

దీంతో ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు అతడికి ఈ పాటికే వివాహం అయినట్లు తెలిసింది. దీంతో ఆమె నిలదీయగా తననే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. తనతో కలిసి ఉండకపోతే మనం కలిసున్న ఫొటోలు వీడియోలు గ్రూపుల్లో పెడతానంటూ బాధితురాలు నిస్సహాయ స్థితిలో ఉండిపోతోంది. నగరంలోని ఎస్ ఆర్ నగర్ కు చెందిన పార్వతి రెండేళ్ల క్రితం భర్తతో విడిపోయి టైలరింగ్ చేసుకుంటూ తన బిడ్డను పోషించుకుంటోంది.
ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన అమర్ తేజ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. నీ బిడ్డకు నీకు తోడుంటానని నమ్మబలికి ఆరు నెలలుగా కోరిక తీర్చుకుంటున్నాడు. పెళ్లి అంటే తప్పించుకున్నాడు. దీంతో అతడిని నిలదీయగా అసలు విషయం తెలిసింది. అతడికి పెళ్లి జరిగినట్లు తెలియడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీంతో అతడిని దూరం పెట్టింది. అయినా తన కోరిక తీర్చాలని మళ్లీ వెంటపడుతుండటంతో చందానగర్ పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు ఫొటోలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకోసారి ఆమెపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా అరెస్టు చేస్తామని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఒంటరిగా ఉండే మహిళలపై మృగాళ్ల కళ్లు పడటం సాధారణమే. కానీ మహిళలు లొంగకుండా ఉంటేనే మంచిది. ఇలా లొంగితే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు అటు భర్త లేక ఇటు ప్రియుడు మోసం చేయడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరిని పడితే వారిని నమ్మి వారికి సర్వస్వం అప్పగించొద్దని చెబుతున్నారు. బాధితురాలిది ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంగా చెబుతోంది.