Homeఎంటర్టైన్మెంట్Anand Devarakonda's 'HIGHWAY' Shooting Over: ఆనంద్‌ దేవరకొండ 'హైవే' షూటింగ్ పూర్తి,

Anand Devarakonda’s ‘HIGHWAY’ Shooting Over: ఆనంద్‌ దేవరకొండ ‘హైవే’ షూటింగ్ పూర్తి,

Anand Devarakonda’s ‘HIGHWAY’ Shooting Over: ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫ‌ర్ గా పని చేసిన కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం హైవే. ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకున్న యువ నటుడు, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా, మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచ‌నాలు పెట్టుకున్నారు సినిమా టీం. తాజాగా నిన్న ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని సినిమా టీం వెల్లడించింది.

 

anand devarakonda, manasa radha krishnan

 

చిత్ర దర్శకుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహన్‌ మాట్లాడుతూ ఈ చిత్రం ‘హైవే’ నేపథ్యంలో సాగే ఒక సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ అని, వినూత్న కాన్సెప్ట్‌తో, ప్ర‌తిక్ష‌ణం ట్విస్టులు, ఆస‌క్తిక‌ర మలుపులతో ఉంటుందని తెలిపాడు. సినిమా చిత్రీకరణకోసం రెండు తెలుగురాష్ట్రాలలో అందమైన లొకేషన్లతో పాటు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో కూడా షూటింగ్ జరిపామని, పూర్తి విలువలతో సినిమా రూపుదిద్దుకుందని గుహన్ తెలిపాడు. త్వ‌ర‌లో సినిమాకు సంబంధించి విషయాలతో ముందుకు వ‌స్తామని వారు అన్నారు.

 

ఈ చిత్రాన్ని శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2 పై వెంకట్‌ తలారి నిర్మిస్తున్నాడు. అతడు, జల్సా లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫ‌ర్ గా పని చేసిన గుహ‌న్ గారు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారని, సినిమా త్వరగా పూర్తయింది, సినిమా అందరికి నచ్చుతుందని సంతోషం వ్యక్తం చేశారు. నటీనటులు ఆనంద్ దేవ‌ర‌కొండ‌, మాన‌స రాధాకృష్ణన్ అద్భుతంగా నటించారని, సినిమా ప్రకటించినప్పటినుండి మంచి టాక్ వచ్చిందని తెలిపాడు. మూవీ షూటింగ్ పూర్త‌య్యిందని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపాడు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper