‘మా’ ఎన్నికల ప్రచారం రసవత్తంగా జరుగుతున్నవేళా మాజీ అధ్యకుడు నరేష్ పై గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన నటుడు శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరుగుతున్న వివాదాలకు నరేష్ పూర్తి బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను చేసిన తప్పిదం వల్ల ఈరోజు ‘మా’ ఈ స్థితిలో ఉందని సంచలన ఆరోపణలు చేశారు శివాజీరాజా. తాను ఎప్పుడు అబద్దాలే చెపుతాడని అసోసియేషన్‌లో నరేశ్ చిన్నపిల్లాడని, నరేష్‌కు, అతనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని కానీ తనపై నరేష్ అసత్యప్రచారాలు చేశాడన్నారు. ఇక తాను ఆడిన ఆటలో తన ప్రాణ మిత్రులను కూడా దూరం చేసుకోవాల్సిన పరిస్థితీ వచ్చిందని శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాను గతంలో ‘మా’ అధ్యక్షుడిగా పనిచేసేటప్పుడు నిధుల సేకరణ కోసం యూఎస్‌లో ఓ ఈవెంట్ నిర్వహించామని, సినీ పరిశ్రమకు చెందిన హీరోహీరోయిన్లను తీసుకువెళ్లి అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశామని, దానికి చిరంజీవి కూడా వచ్చారన్నారు. కానీ అప్పుడు జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న నరేశ్ మాత్రం ఆ ప్రోగ్రామ్‌కి రాలేదని, పైగా ఇక్కడ వేరే వాళ్లతో మీటింగ్ పెట్టుకున్నాడు. యూఎస్ టూర్ విమాన టిక్కెట్ల వ్యవహారంలో తాను, శ్రీకాంత్ డబ్బులు వాడుకున్నామని, మాపై వ్యతిరేక ఆరోపణలు వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి సినీ పెద్దలతో ఓ కమిటీ వేసి అవన్నీ అవాస్తవాలే అని, శ్రీకాంత్, తాను డబ్బుల విషయంలో ఎలాంటి తప్పులు చేయలేదని నిరూపించారు. ఇలా నరేష్ చేసిన వ్యాఖ్యల వల్ల నేను శ్రీకాంత్ ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అయినా కూడా నరేశ్ ఇప్పటివరకూ మాకు క్షమాపణలు చెప్పలేదన్నారు. తన హయాంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌ల ద్వారా వచ్చిన ఫండ్‌ని ‘మా’ సంక్షేమం కోసం నరేశ్ వినియోగించాడన్నారు. అతని రాకతోనే అసోసియేషన్‌లో అంతర్గత రాజకీయాలు ప్రారంభమయ్యాయి.
అసోసియేషన్ లోని వృద్ధ సభ్యుల కోసం ఓ వృద్ధాశ్రమం నిర్మించాలని అనుకున్నానని, దానికి ఫండ్ రైజ్ చేయడం కోసం అమెరికాలో మరోసారి ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నానని, మహేశ్‌తో ఆ విషయం చెప్పగానే ‘తనకు ఓకే అని, ఒక్కసారి నమ్రతని కలిసి ఈ విషయం చెప్పండని అన్నారు. వెంటనే నేను, బెనర్జీ, నరేశ్ మరో ఎనిమిది మంది సభ్యులు మహేశ్ ఇంటికి వెళ్లి నమ్రతతో మాట్లాడగా, ఆమె కూడా అందుకు ఓకే చెప్పారు. ప్రభాస్‌ని కలవగా, తాను బిజీగా ఉన్నానని, రాలేకపోవచ్చు. కానీ, ఆ ఫండ్‌లో తన వాటాగా రెండు కోట్లు ఇస్తానని చెప్పారు. ఇలా స్టార్ హీరో హీరోయిన్స్ ఒక ఈవెంట్ కి ఒప్పుకున్నాకా, నరేశ్ ప్రెస్‌మీట్ పెట్టి తనపై లేనిపోనివి తీవ్ర ఆరోపణలు చేశాడన్నారు. ఆ తర్వాత వెంటనే ‘మా’ ఎన్నికలు జరగగా, నాగబాబు అతనికి సహరించడంతో, తన ప్యానల్ ఓడిపోయిందన్నారు. నరేశ్‌కు నాగబాబు ఎందుకు మద్దతు ఇచ్చారో ఇప్పటికీ తనకి తెలియదని, తన ఓటమితో ఆ ప్రోగ్రామ్ ఆగిపోయిందని, ఆ కల కలలాగే నిలిచిపోయిందని విచారం వ్యక్తం చేశాడు. అనంతరం ఇకపై జరిగే ఎన్నికల్లో ఉత్సహంగా పాల్గొనని శివాజీ రాజా అన్నారు.