Bigg Boss 10 Telugu: గడిచిన 9 బిగ్ బాస్ సీజన్స్ లో ఎంతో మంది భిన్నమైన క్యారెక్టర్స్ ఉన్న కంటెస్టెంట్స్ ని మనం చూసాము కానీ , త్రిగున్ లాంటి కంటెస్టెంట్ ని మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఇది పాజిటివ్ వే లో చెప్పడం లేదు , పూర్తిగా నెగెటివ్ వే లోనే చెప్పాల్సి వస్తోంది. రోహిత్ ని ఇతను టార్గెట్ చేసే విధానం చూస్తే , మానవత్వం ఉన్న ఏ మనిషికి అయినా రక్తం మరిగిపోతుంది. ఇలాంటి వ్యక్తులు మన నిజ జీవితం లో ఉంటే ఎలా రియాక్ట్ అయ్యే వాళ్ళమో తెలియదు కానీ , రోహిత్ మాత్రం ఇతన్ని డీల్ చేసే విధానం ని చూస్తే దండం పెట్టేయొచ్చు. అతను ఎన్ని విధాలుగా రెచ్చగొడుతున్నప్పటికీ కూడా , సహనం కోల్పోకుండా , నోరు జారకుండా రోహిత్ వ్యవహరించే తీరు ని చూస్తుంటే అతను తల్లిదండ్రులు ఎంత గొప్ప విలువలతో పెంచారు అనేది అర్థం అవుతోంది.
మొన్నటి ఎపిసోడ్ లో డిష్ వాషింగ్ విషయం లో రోహిత్, త్రిగున్ మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉన్నిందో మనమంతా చూసాము. అది కేవలం ఒక్క శాతం మాత్రమే. ఈరోజు త్రిగున్ రోహిత్ పై వదిలిన లూజ్ మాటలు చూస్తే, అసలు ఏమి మనిషి రా బాబు ఈ త్రిగున్ అని అనిపించక తప్పదు. అసలు విషయం లోకి వెళ్తే రోహిత్ మాట్లాడిన క్యాజువల్ మాటలను ట్విస్ట్ చేస్తూ , నా వృత్తిని అవమానించాడు అంటూ త్రిగున్ చేసిన ఆరోపణలు ఆశ్చర్యానికి గురి చేశాయి. మొన్నటి ఎపిసోడ్ లో త్రిగున్ రోహిత్ అనని మాటలను అన్నట్టుగా చెప్తుంటే , ‘నీకు నువ్వు సొంత స్క్రిప్ట్ ఊహించుకొని రాసుకోకు’ అని అంటాడు. ఇది తన స్క్రిప్ట్ రైటింగ్ వృత్తిని అవమానించినట్టు అట. దీన్ని మనసులో పెట్టుకొని రోహిత్ ని నిన్నటి ఎపిసోడ్ లో డిష్ వాషింగ్ సమయం లో చేసిన టార్గెటింగ్ ని మాటల్లో వర్ణించలేము.
నీదొక స్టిరాయిడ్స్ వాడిన శరీరమని, పిల్ల బచ్చా గాడివని, తొక్కలో అగ్ని పరీక్ష షో అని , ఇలా ఒక్కటా రెండా ఎన్నో లూజ్ మాటలు వదిలేసాడు. అంతే కాకుండా డొల్ల రాజా అని రోహిత్ కి నామకరణం చేసి, పాట కూడా పాడుతూ అతన్ని ఎగతాళి చేయడం దారుణమైన చర్య గా అనిపించింది. బిగ్ బాస్ సీజన్ 7 లో గౌతమ్ యావర్ ని స్టిరాయిడ్స్ వాడినావా అని మాట్లాడిన మాటలకు యావర్ ఏ రేంజ్ లో ఫైర్ అయ్యాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గౌతమ్ ని దాదాపుగా కొట్టేంత పని చేసాడు. రోహిత్ కూడా ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం ఇది. కానీ చాలా సింపుల్ గా ‘చూడు ఎలా మాట్లాడుతున్నావో , ఇదే నువ్వు. నిన్ను చూసి కోపం తెచ్చుకోవాలి , జాలి పడాలో అర్థం కావడం లేదు’ అని సింపుల్ గా ఒక నవ్వు నవ్వి తీసిపారేసాడు.
ఈ అంశం పై వీకెండ్ లో నాగార్జున నుండి త్రిగున్ కి కోటింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది అని చెప్పొచ్చు. ఒకవేళ నాగార్జున ఈ విషయాన్ని అడ్రస్ చేయకపోతే , ఈ సీజన్ ఇక డిజాస్టర్ వైపు అడుగులు వేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే చరణ్ ని అన్యాయంగా మూడు రోజులకే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి పంపేయడం ఈ సీజన్ కి చాలా పెద్ద మైనస్ అయ్యింది. కేవలం నాలుగు రోజుల్లో , పరిచయాలు కూడా పెద్దగా జరగని కంటెస్టెంట్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని , చరణ్ ని ఎలిమినేట్ చేయడం ఎంత వరకు కరెక్ట్?, ఏదైనా టాస్క్ పెట్టి ఎలిమినేట్ చేసినా , లేదా ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేసినా చాలా న్యాయం గా ఉండేది. కానీ కేవలం మూడు రోజుల్లో ఒక కంటెస్టెంట్ ని తొలగించడం చాలా అన్యాయం. ఇప్పటికీ చరణ్ రీ ఎంట్రీ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ బిగ్ బాస్ మైండ్ లో అలాంటి ఆలోచనలే లేవట.
కేవలం మూడు రోజులు హౌస్ లో ఉంచేందుకు చరణ్ ని ఎందుకు ‘అగ్ని పరీక్ష’ నుండి ఎంచుకోవడం?, వాళ్లకు నచ్చకపోతే రామకృష్ణ , రాజకుమారి , అపూర్వ, దీపక్ వంటి కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరిని చరణ్ కి బదులుగా పంపొచ్చు కదా. చరణ్ కచ్చితంగా పొటెన్షియల్ ఉన్న వ్యక్తి, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ కొంతమంది కొన్ని వాతావరణాలకు సర్దుకోవాలంటే కొన్ని రోజుల సమయం కావాలి. పాపం చరణ్ కి సర్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదు బిగ్ బాస్ టీం. మొదటి వారం లో మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టాలనే ఆలోచన ఏదైతే ఉందో, బిగ్ బాస్ హిస్టరీ లోనే పరమ చెత్త ఆలోచనల్లో ఒకటిగా పరిగణించొచ్చు. పాపం చరణ్ కి కేవలం రోహిత్, అమన్ , శ్రేష్టి , షాలిని మాత్రమే ఓట్లు వేశారు. అగ్ని పరీక్ష 2 నుండి వచ్చిన ఝాన్సీ ఎప్పటి లాగానే నక్క దెబ్బ తీసింది. పాపం చరణ్ ఝాన్సీ వద్దకు వెళ్లి ఏడుస్తూ దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని కోరుతాడు. కనీసం అతను అలా కోరినందుకు అయినా ఝాన్సీ చరణ్ కి సపోర్ట్ చేస్తుందేమో అని ఆశించాం. కానీ కట్టప్ప లాగా దెబ్బ తీసింది. 22 రోజుల పాటు సావాసం చేసిన కంటెస్టెంట్ అక్కర్లేదు , నిన్నగాక మొన్న పరిచయమైనా సెలబ్రిటీలు ఎక్కువ అయిపోయారు. ఝాన్సీ ఒక్క ఓటు వల్ల చరణ్ సేవ్ అయిపోడు , ఎందుకంటే రామ్ ప్రసాద్ కి అప్పటికే భారీ లీడింగ్ ఓట్ల సంఖ్య ఉంది. దయనీయంగా నీ దగ్గరకు వచ్చి , నాకు జీవితం లో వచ్చిన అతి ముఖ్యమైన అవకాశం , దయచేసి సపోర్ట్ చేయి అని అడిగినందుకు అయినా ఝాన్సీ సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఆమె మనం ఆశించినట్టు చేస్తే కట్టప్ప అనే పేరు ఎందుకు వస్తుంది చెప్పండి , మన పిచ్చి కాకపోతే. నిన్నటి ఎపిసోడ్ లో రోహిత్ తో త్రిగున్ వ్యవహరించిన తీరు గురించి , చరణ్ ఎలిమినేషన్ గురించి, ఝాన్సీ వెన్నుపోటు గురించి , మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి. మా కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.