spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Arjun wife Sneha Reddy : అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి ఫిట్నెస్...

Allu Arjun wife Sneha Reddy : అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి ఫిట్నెస్ సీక్రెట్ ఇదా… ఆ కసరత్తులు చూస్తే మీకు చెమటలు పడతాయి! వైరల్ వీడియో

Allu Arjun wife Sneha Reddy : హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫిట్నెస్ కి ఆమె చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆమె రెగ్యులర్ గా జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంటారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. స్నేహ రెడ్డి తాజాగా షేర్ చేసిన జిమ్ వీడియో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వ్యక్తిగత, ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది. ఆమెకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. హీరోయిన్లకు సమానంగా స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది. 9 మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు అంటే స్నేహ రెడ్డి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ భార్య గానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది.

మరోవైపు బిజినెస్ ఉమన్ గా రాణిస్తుంది. స్నేహ రెడ్డి డైట్, ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తోంది. యోగ, జిమ్ లో వర్కౌట్స్ వంటివి చేస్తుంటారు. యోగ తన ఫిటెనెస్ సీక్రెట్ అని స్నేహ చెప్తుంటారు. తాజాగా జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ఆమె పోస్ట్ చేసింది. ఇందులో ఆమె రకరకాల వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

బాగా కష్టపడుతున్నారు. ఫిట్నెస్ కాపాడుకోవడంలో మీరు ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్నేహ రెడ్డి బెస్ట్ మదర్ కూడాను. తన ఇద్దరు పిల్లలు అయాన్, అర్హల సంరక్షణ బాధ్యత గొప్పగా నెరవేరుస్తుంది. అయాన్, అర్హ చాలా యాక్టీవ్. అర్హ ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంలో అర్హ బాల భరతుడు పాత్ర చేసింది. శాకుంతలం మూవీలో అల్లు అర్హ చివర్లో వచ్చి మెరుపులు మెరిపించింది. పసిప్రాయంలోనే గొప్పగా నటించింది.

ఇది ఇలా ఉంటే .. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప 2 షూటింగ్ ఆలస్యం కావడంతో ఏడాది చివరికి పోస్ట్ పోన్ అయింది. పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల కానుంది.

ఈసారి చెప్పిన తేదీకి పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సుకుమార్ శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారని తెలుస్తుంది. పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

RELATED ARTICLES

Most Popular