Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Wife Sneha Reddy: ఆ విషయంలో బన్నీ భార్య వెరీ టఫ్.. ఏం...

Allu Arjun Wife Sneha Reddy: ఆ విషయంలో బన్నీ భార్య వెరీ టఫ్.. ఏం చేసిందో తెలుసా?

Allu Arjun Wife Sneha Reddy: సినీ తారల పర్సనల్ విషయాలు ఒకప్పుడు బయపడేవి కావు. కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత వారి కుటుంబ విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఇటీవల కొందరు స్టార్ హీరోల సతీమణులు హీరోయిన్లతో సమానంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. భర్తలు స్టార్లు కాగా.. వారి సతీమణులు సైతం పలు పంక్షన్లకు అటెంట్ అవుతూ సందడి చేస్తున్నారు. మెగా హీరోల విషయానికొస్తే రామ్ చరణ్ సతీమణి ఉపాసన కు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఉపాసన సైతం చెర్రీ విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి సినీ ఆడియన్స్ కు సుపరిచితమే. బన్నీ తన వైఫ్ తో కలిసి అప్పుడప్పుడు ఫోటో షూట్ చేసి నెట్టింట్లో పెడుతాడు. లేటేస్టుగా బన్నీ విషయంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. దీంతో స్నేహ రెడ్డి కాస్ట్ టఫ్ గా వ్యవహరించారట. ఇంతకీ ఏం జరిగిందంటే?

‘పుష్ప’ హిట్ తో బన్నీ రేంజ్ పాన్ ఇండియా లెవల్లోకి వెళ్లింది. ఇప్పుడు ఆయనతో సినిమాలో నటించాలని ప్రతీ ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. పుష్పలో నటించిన రష్మిక పుష్ప2లోనూ పోషిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడంతో మరో మూవీ కూడా ఉంటుందని అంటున్నారు. అంతకుముందు అల్లు అర్జున్ తో నటించిన వాళ్లు సైతం మరోసారి బన్నీతో నటించాలని కోరుకుంటారట. ఈ నేపథ్యంలో కొందరు బన్నీతో పర్సనల్ గా టచ్ లో ఉంటున్నారట. వీరిలో ఓ భామ బన్నీకి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ సరదాగా మాట్లాడుతూ ఉండేదట.

అయితే బన్నీ ఆమెను లైట్ గానే తీసుకున్నాడు. కానీ ఆమె మాత్రం హద్దులు దాటబోయింది. ఐకాన్ స్టార్ ను బుట్టలో వేసుకునేందుకు ప్రయోగాలు చేయబోయింది. రోజూ మాట్లాడుతూ ఓసారి కాస్త రోమాంటిక్ డైలాగ్ లను వదిలిందట. అయినా బన్నీ వాటిని పట్టించుకోలేదట. ఎవరైనా తనపై ఉన్న అభిమానంతో ఇలా మాట్లాడుతారని అనుకున్నాడట. కానీ ఆ హీరోయిన్ మాత్రం అలా అనుకోకుండా వేరే ఉద్దేశంతో బన్నీతో కాస్త క్లోజ్ కావడానికి ట్రై చేసిందట.

ఈ విషయం బన్నీ భార్య స్నేహ రెడ్డి వరకు వెళ్లింది. ఏ ఆడపడుచు అయినా తన భర్తకు సన్నిహితంగా ఉంటే ఎవరూ ఒప్పుకుంటారు. దీంతో ఆ హీరోయిన్ కు స్నేహ రెడ్డి ఫోన్ చేసి ఎడాపెడా వాయించిందంట. ఇంకోసారి ఫోన్ చేస్తే యాక్షన్ వేరే ఉంటుందన్న అన్న రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిందట. స్నేహ రెడ్డి వార్నింగ్ తో ఆ హీరోయిన్ ఇక బన్నీకి కాల్ చేయడం లేదట. అంతేకాకుండా ఆమెకు అవకాశాలు కూడా లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఎంతైనా స్నేహ రెడ్డి భర్త విషయంలో చాలా టఫ్ గా ఉంటారని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular