Tanya Mittal Bigg Boss : బిగ్ బాస్ సెలబ్రిటీలకు బయట పబ్లిక్ లో మంచి ఇమేజ్ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం మొదటి వారం బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఎలిమినేట్ అయిన వాళ్లకు కూడా కొన్నాళ్ల పాటు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుంది. జనాలు ఈ షో ద్వారా అంతలా కనెక్ట్ అవుతారు కాబట్టే ఈ రేంజ్ ఫేమ్ కంటెస్టెంట్స్ కి వస్తుంది. కానీ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ బయటకు వచ్చిన తర్వాత ఆమె చుట్టూ 150 మంది బాడీ గార్డ్స్ ఉంటారట. ఎక్కడికి వెళ్లినా అభిమానుల తాకిడి నుండి ఆమె తనని తానూ రక్షించుకోవడం కోసం వీఈల్లందరిని తన వెంట తీసుకెళ్తుందని, ముఖ్యమంత్రికి కి కూడా ఈ రేంజ్ ఫాలోయింగ్ లేదని అంటున్నారు. ఇంతకీ అంత ఫేమ్ ని సంపాదించిన ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ మన తెలుగు బిగ్ బాస్ కి సంబంధించిన వారు కాదు.
ఆ కంటెస్టెంట్ హిందీ బిగ్ బాస్ కి సంబంధించిన అమ్మాయి. ఆమె పేరు తాన్య మిట్టల్(Tanya Mittal). నాకు 150 మంది బాడీ గార్డ్స్ ఉన్నారని, పూటకు ఒక చీర కడుతానని, ఇలా తన లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి చాలానే మాట్లాడింది. దీనిపై లేటెస్ట్ గా ఆమె మరోసారి వివరణ ఇస్తూ ‘నేను నా క్రింద కేవలం 150 మంది పని చేస్తారని మాత్రమే చెప్పాను, అంతే తప్ప, వాళ్లంతా నా బాడీ గార్డ్స్ అని ఎప్పుడూ చెప్పలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నా తోటి కంటెస్టెంట్ జైశా ఖాద్రి సరదాగా వాళ్లందరినీ నా బాడీ గార్డ్స్ అన్నారు. అప్పటి నుండి సోషల్ మీడియా లో ఎన్నో కథనాలు వచ్చాయి, వాస్తవాల గురించి మాట్లాడకుండా, రకరకాల కథలు అల్లుతున్నారు. నాకు సెక్యూరిటీ సిబ్బంది ఉన్న విషయం వాస్తవమే . నాకు వ్యక్తిగతంగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు’
‘నాకు ఒక ఫార్మా ఫ్యాక్టరీ, గిఫ్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, వస్త్ర పరిశ్రమ వంటి వ్యాపారాలు ఉన్నాయి. వాటి కోసం మాత్రమే నాకు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. మీరు అనుకున్నట్టు ఆ సంఖ్య 150 కాదు, నాకు అబద్దాలు చెప్పడం రాదు, దయచేసి నాపై తప్పుడు కథనాలు రాయొద్దు’ అంటూ చెప్పుకొచ్చింది తాన్య మిట్టల్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తన పెర్ఫార్మన్స్ మరియు నడవడిక తో బోలెడంత కంటెంట్ ఇచ్చిన తాన్య, బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే రేంజ్ కంటెంట్ ఇస్తోంది.