Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: బన్నీ ఖాతాలో మరో రికార్డు.. ఇండియా లోనే తొలి నటుడు!

Allu Arjun: బన్నీ ఖాతాలో మరో రికార్డు.. ఇండియా లోనే తొలి నటుడు!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న ఆల్ ఇండియా ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో మరో హీరోకి సాధ్యం కాని రీతిలో అల్లు అర్జున్ కి క్రేజ్ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో బన్నీ కి అసాధారణ రీతిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన ఇన్స్టా అకౌంట్ కి 21. 8 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా దీనికి అనుబంధంగా థ్రెడ్స్ అప్ ను తీసుకొని వచ్చారు. ఇందులో కూడా అల్లు అర్జున్ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.

ఇండియా లోనే వన్ మిలియన్స్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న తొలి నటుడిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. దీనిని బట్టి చెప్పవచ్చు బన్నీ రేంజ్ ఏమిటి అనేది. ప్లాట్ ఫామ్ ఏదైనా సరే ఐకాన్ స్టార్ తర్వాతే అన్నట్లు ఉంటుంది. పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బన్నీకి నార్త్ లో కూడా అభిమాన గుణం ఏర్పడింది. అందుకే థ్రెడ్స్ లో అంత త్వరగా వన్ మిలియన్ ఫాలోవర్స్ ని సాధించాడు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమాలో నటిస్తున్న బన్నీ మరో వైపు ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మరో పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా విడుదల అయ్యింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురం ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే, దీంతో బన్నీ- త్రివిక్రమ్ కాంబో పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా తో మరో సినిమా ఉండబోతుంది. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక పుష్ప 2పై భారీ అంచనాలున్నాయి. రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది. వెయ్యి కోట్ల వసూళ్లే టార్గెట్ గా పుష్ప 2 బాక్సాఫీస్ బరిలో దిగుతుంది. వేర్ ఈజ్ పుష్ప? పేరుతో విడుదలైన కాన్సెప్ట్ టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper
Exit mobile version