https://oktelugu.com/

Jabardasth Varsha: చుడిదార్ లో చందమామలా మెరిసిన జబర్దస్త్ వర్ష… లేటెస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా!

ఇమ్మానియల్ నాకు దొరికిన అదృష్టం అని చెప్పుకునే వర్ష, ఎవరు ఏమన్నా అతన్ని వదిలేది లేదంటుంది. వర్ష, ఇమ్మానియల్ బుల్లితెర లవ్ బర్డ్స్ గా అవతరించారు. సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ అనంతరం ఆ స్థాయిలో ప్రేమికులుగా ప్రచారం దక్కించుకున్నారు. నల్లగా ఉండే అబ్బాయిని ప్రేమించిన అమ్మాయిగా వర్ష ప్రత్యేకత చాటుకుంది. ఈ క్రమంలో ఆమె ట్రోలింగ్ కి గురైంది.

Written By:
  • Shiva
  • , Updated On : July 25, 2023 / 12:57 PM IST

    Jabardasth Varsha

    Follow us on

    Jabardasth Varsha: బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా అవతరించింది వర్ష. జబర్దస్త్ వేదికగా ఈమె పాపులర్ అయ్యారు. సీరియల్ నటిగా కెరీర్ మొదలు పెట్టిన వర్షకు గుర్తింపుకు నోచుకోలేదు. దాంతో జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చింది. ఆ నిర్ణయం వర్ష ఫేట్ మార్చేసింది. అప్పటి వరకు లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు వర్ష గ్లామర్ సరికొత్తగా తోచింది. అనతి కాలంలో వర్షకు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. వర్ష తక్కువ సమయంలో పాప్యులర్ కావడానికి మరో రీజన్ కూడా ఉంది. కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్స్ సక్సెస్ అయ్యాయి. ఇమ్మానియల్ లవర్ గా వర్ష ఇమేజ్ తెచ్చుకుంది.

    ఇమ్మానియల్ నాకు దొరికిన అదృష్టం అని చెప్పుకునే వర్ష, ఎవరు ఏమన్నా అతన్ని వదిలేది లేదంటుంది. వర్ష, ఇమ్మానియల్ బుల్లితెర లవ్ బర్డ్స్ గా అవతరించారు. సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ అనంతరం ఆ స్థాయిలో ప్రేమికులుగా ప్రచారం దక్కించుకున్నారు. నల్లగా ఉండే అబ్బాయిని ప్రేమించిన అమ్మాయిగా వర్ష ప్రత్యేకత చాటుకుంది. ఈ క్రమంలో ఆమె ట్రోలింగ్ కి గురైంది.

    యూట్యూబ్ లో వర్ష-ఇమ్మానియేల్ వీడియోలకు దారుణమైన కామెంట్స్ వచ్చేవట. ఒకసారి వర్ష తమ్ముడు ఈ కామెంట్స్ ఏంటీ? అని నిలదీశాడట. హర్ట్ అయిన వర్ష జబర్దస్త్ మానేస్తున్నట్లు ప్రకటించింది. చెప్పినట్లే కొన్నాళ్ళు వర్ష జబర్దస్త్ కి దూరమైంది. గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వర్ష దూసుకుపోతుంది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా సత్తా చాటుతుంది. వర్ష ఇమేజ్ పెరిగిన నేపథ్యంలో సంపాదన కూడా పెరిగింది.

    ఈ మధ్య షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి కూడా వెళుతుంది. ఇంస్టాగ్రామ్ లో వర్ష ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. అందుకు తరచుగా ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడమే కారణం. తాజాగా ఎల్లో కలర్ చుడిదార్ లో మెస్మరైజింగ్ ఫోటో షూట్ చేసింది. వర్ష లుక్ కి ఫిదా అయిన ఫ్యాన్స్ ఆమె అందాన్ని వర్ణిస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.