spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన...

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్ మ్యానేజర్..

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య చంద్ర శేఖర్ అల్లు అర్జున్ రాజకీయ అరంగేట్రానికి చాలా సపోర్టు చేస్తున్నారని , రీసెంట్ గా ముంబై లో అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ వంటి వారితో కూడా చర్చలు జరిపారని , ఇలా ఒక్కటా రెండా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా స్పందించిన అల్లు అర్జున్ టీం , అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు. ఇక లేటెస్ట్ గా అల్లు అర్జున్ వ్యక్తిగత మ్యానేజర్ శరత్ చంద్ర కూడా ఈ అంశంపై మరోసారి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అది పూర్తిగా ఫేక్ న్యూస్ అంటూ తేల్చి చెప్పారు.

ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ ప్రస్తుత ఫోకస్ మొత్తం సినిమాల మీదనే ఉంది. ఇండియా లో మోస్ట్ బిజీ గా ఉండే హీరోల్లో ఆయన ఒకరు. ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు , ఇలాంటి పీక్ సినిమా కెరీర్ ని వదిలి ఆయనేందుకు రాజకీయాల్లోకి వస్తారు?, అంత అవసరం ఏముంది? , ఈమధ్య విచిత్రంగా కొన్ని వార్తలు కూడా చూశాను. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని , ఆయనతో పాటు అల్లు అర్జున్ కూడా ఒక కొత్త పార్టీ తో రాబోతున్నారని పుకార్లు పుట్టించారు. అది చూసిన తర్వాత నాకు నవ్వొచ్చింది. ఇలాంటి కథనాలు క్రియేట్ చేసేవాళ్లకు ఎక్కడి నుండి ఇలాంటి ఆలోచనలు వస్తాయో అర్థం అవ్వడం లేదు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అంటూ స్పష్టం చేశారు శరత్ చంద్ర. కనీసం ఇప్పటి నుండి అయినా ఈ ఊహాగానాలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.

ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్నారు. ముంబై లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రధానంగా జరుగుతూ వస్తోంది . ఈ ఏడాది డిసెంబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చెయ్యాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఈ చిత్రం తర్వాత వెంటనే ఆయన లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని కూడా ముంబై లో షూట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోకస్ ఈ రెండు సినిమాల పైనే ఉంది. ఆ తర్వాత ఆయన మలయాళం టాప్ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ తో ఒక సినిమా చేయనున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version