Allu Arjun – Atlee : గంగోత్రి (Gangotri) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)…ఆ సినిమా సక్సెస్ అయినప్పటికి ఆయనకు అంత మంచి గుర్తింపైతే రాలేదు. ఎప్పుడైతే ఆర్య సినిమా తీశాడో అప్పటినుంచి మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకోవడమే కాకుండా యూత్ ఐకాన్ గా కూడా మారిపోయాడు. అప్పటి నుంచి స్టైలిష్ స్టార్ గా తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ఆయన నటనకు గుర్తుగా వరుస సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో ఎవ్వరికి దక్కని ఒక గొప్ప గౌరవాన్ని దక్కించుకున్నాడు. పుష్ప 2 (Pushpa 2) సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. బాహుబలి 2 (Bahubali 2) సినిమాతో పెను రికార్డులను సైతం బ్రేక్ చేశాడు. మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు సైతం చెమటలు పట్టించేలా ఆయన స్టోరీ సెలెక్షన్ ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో తను కూడా ఒకడిగా ఉండడం విశేషం…
ప్రస్తుతం ఆయన అట్లీ (Atlee) డైరెక్షన్లో ఒక భారీ గ్రాఫికల్ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ఈ మూవీ లో గ్రాఫిక్స్ అయితే ఉంటుందట. 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ డైరెక్టర్ గా ఎదగాలని చూస్తుంటే అల్లు అర్జున్ సైతం హాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ కి వెళ్లాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
Also Read : అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి సంచలన అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే!
ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతుందనే విషయాన్ని కూడా రీసెంట్ గా సినిమా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఒక మెడికల్ మాఫియా మీద ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. వరల్డ్ మొత్తాన్ని కనెక్ట్ చేస్తూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దానికి మెడికల్ మాఫియా ఎలాంటి ప్రమాదాలకు గురిచేస్తుంది అనే కథతో రాబోతుందట. ఇక ఈ సినిమాలో అర్జున్ ఒక డాక్టర్ గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అతను మెడికల్ మాఫియా బాగోతలను బయటపెడుతూ వాళ్లు ప్రవేశ పెట్టే వైరస్ ని అంతం చేయబోతున్నాడట. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా కథ ప్రేక్షకులను ఎగ్జైట్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని అల్లు అర్జున్ అభిమానులు సైతం కోరుకుంటుండటం విశేషం…