Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు(MaheshBabu)…ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూసేవారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ లో ఒక్కడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే తనకి ఒక్కడు లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ని అందించిన గుణశేఖర్ (Gunashekar) దర్శకత్వంలో ఆయన బ్యాక్ టు బ్యాక్ అర్జున్, సైనికుడు లాంటి సినిమాలను చేశాడు. ఆ రెండు సినిమాలు ఆశించిన మేరకు విజయాలు సాధించకపోవడంతో ఒక్కడు సినిమాతో గుణశేఖర్ కి భారీ సక్సెస్ ని అందించిన మహేష్ బాబు ఈ మూవీస్ తో అతనికి భారీ డిజాస్టర్ లను కట్టబెట్టాడు. ఈ సినిమాలు గుణశేఖర్ కెరియర్ గ్రాఫ్ ను తగ్గింఛాయనే చెప్పాలి. నిజానికి మహేష్ బాబు వల్ల ఒకడు సినిమా ఆడలేదు.
గుణశేఖర్ అందులో వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకొని ప్రేక్షకులకు కనెక్ట్ చేసే విధంగా సినిమాను తీర్చిదిద్దడంతో ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక అర్జున్, సైనికుడు సినిమాలా విషయానికి వచ్చేసరికి వీళ్ళ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉండడంతో ఆ అంచనాలకు తగ్గట్టుగా గుణశేఖర్ ఆ సినిమాలను తెరకెక్కించకపోవడం వల్ల ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
Also Read : మహేష్ కోసం పోటీ పడుతున్న ఆ ముగ్గురు దర్శకులు..తదుపరి చిత్రం ఎవరితో అంటే!
ఫలితంగా ఆయన మార్కెట్ అయితే డౌన్ అయింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అడపదడప ఆడుతున్నప్పటికి భారీ సక్సెస్ లను మాత్రం సాధించలేకపోతున్నాడు. కారణమేదైనా కూడా ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదం అయితే ఉంది. ఇక మహేష్ బాబు తో మరోసారి సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నప్పటికి ఆయన ఈ దర్శకుడికి అవకాశం అయితే ఇవ్వడంలేదు. సక్సెస్ లో ఉన్న వాళ్లకు మాత్రమే మహేష్ బాబు అవకాశాన్ని ఇస్తాడు అనేది మనందరికి తెలిసిందే. అందువల్లే గుణశేఖర్ ని కూడా పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తోంది…