Allu Arjun Atlee movie : ‘పుష్ప 2′(Pushpa 2 Movie) వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తమిళ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా ఒక ప్రకటన వీడియో విడుదల చేసారు. ఈ వీడియో కి సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. ఎక్కడ చూసినా దీని గురించి మాట్లాడుకున్నారు. ఇతర హీరోల అభిమానులు అసూయ పడేలా చేసింది ఈ వీడియో. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ తనని తాను కొత్తగా మార్చుకునేందుకు వర్కౌట్స్ కూడా మొదలు పెట్టేసాడు. గత నెల రోజులుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో డైరెక్టర్ అట్లీ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక కూడా జరిగిపోయిందట. వచ్చే నెల నుండి షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టే అవకాశం ఉంటుంది.
ఇదంతా పక్కన పెడితే ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా విదేశాల్లో ఉన్న అల్లు అర్జున్, అట్లీ ఇప్పుడు హైదరాబాద్ కి తిరిగి వచ్చేసారు. త్వరలోనే లొకేషన్స్ సెలక్షన్ వేటలో బిజీ కానున్నారు. సాధారణంగా ఇలాంటివన్నీ డైరెక్టర్, నిర్మాతలు చూసుకుంటూ ఉంటారు. కానీ అల్లు అర్జున్ ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించి ప్రతీ అంశాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒకే చేయాలట. అంత శ్రద్ద పెట్టాడు ఈ చిత్రం పై. ఇక పోతే ఈ చిత్రం లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయనున్నాడు. అందులో ఒక క్యారక్టర్ యానిమేషన్ రోల్ అట. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కూడా ముట్టుకొని కాన్సెప్ట్ తో ఈ కాంబినేషన్ మన ముందుకు రానుంది.
సుమారుగా 800 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని ఈ చిత్రం కోసం ఖర్చు చేయబోతున్నారట మేకర్స్. అల్లు అర్జున్, అట్లీ లాభాల్లో వాటాలు పంచుకుంటారట. అంటే వాళ్ళ రెమ్యూనరేషన్స్ వంద కోట్ల పైమాటే. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా సాయి అభయంకర్ వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే ప్రైవేట్ ఆల్బమ్స్ తో సాయి అభయంకర్ యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తన మొట్టమొదటి సినిమా ఇంత పెద్ద భారీ బడ్జెట్ చిత్రం అవ్వడం తో ఆయన మ్యూజిక్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ది బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడట. ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ ని ఎంచుకున్నారట. మిగిలిన ఇద్దరు హీరోయిన్ రోల్స్ కోసం జాన్వీ కపూర్, దిశా పటాని ఎంపిక అయ్యినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది షూటింగ్ ని మొదలు పెట్టి కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయాలనే కసితో ఉంది మూవీ టీం.