Narivetta Trailer : ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు వచ్చినా కూడా ఇకమీదట రాబోయే సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేసే సినిమాలే కావడం విశేషం…ప్రస్తుతం ఇండస్ట్రీ కి వస్తున్న యంగ్ మేకర్స్ వాళ్ల ప్రతిభను చూపించుకోవడానికి వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు… ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అక్కడినుంచి ఏ సినిమా వచ్చినా కూడా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు…
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. కొత్త కథలతో దర్శకులు సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఏ లాంగ్వేజ్ లో సినిమా చేసిన కూడా అది ఇండియాలో ఉన్న ప్రతి ఒక ప్రేక్షకుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రేక్షకుల ఆలోచన మేరకు వాళ్ల అభిరుచిని బట్టి సినిమాలను తీయడానికి మేకర్స్ అయితే సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక మలయాళం లో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న నటుడు టోవినో థామస్…ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కినవే కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఇక తెలుగులో సైతం అతనికి మంచి ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు. ఇక ప్రస్తుతం ఆయన చేసిన ‘నరువెట్ట’ (Narivetta) అనే సినిమా తెలుగులో డబ్బవుతుంది.
మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడం విశేషం. ఈ సినిమా ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ని గత కొద్దిసేపటికి క్రితమే రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ట్రైబల్ ఏరియాలో నివసిస్తున్న కొంతమంది జనానికి పోలీసులకి మధ్య జరిగే ఒక ఘర్షణగా తెలుస్తోంది.
ట్రైబల్ ఏరియాను వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళమని పోలీసులు వాళ్ళను డిమాండ్ చేయగా, వాళ్ళు ఇది మా నేల మేము ఇక్కడే ఉంటాం అంటూ పోలీసుల మీద తిరుగుబాటు చేస్తుండడం సినిమా కోర్ ఎలిమెంట్ గా మనకు తెలుస్తోంది. ఇక అక్కడే హీరో ఫైర్ చేసినప్పుడు అతని గన్ను నుంచి ఒక బుల్లెట్ ట్రైబల్ ఏరియాలో నివసిస్తున్న ఒక వ్యక్తికి తగిలి అతను చనిపోతాడు. దానివల్ల టోవినో థామస్ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
మరి నిజానికి ఆ ట్రైబల్ ఏరియాలోని వ్యక్తికి టోవినో థామస్ గన్ లో నుంచి వచ్చిన బుల్లెట్ తగిలిందా? లేదంటే ఇతర పోలీసులు ఎవరైనా చంపి అతని మీద నేరాన్ని నెట్టేస్తున్నారా అనేది తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…ఇక మొత్తానికైతే ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ మొత్తాన్ని ట్రైలర్ లోనే రివిల్ చేశారు… ఇక ఈ సినిమాలో ఫైనల్ ట్విస్ట్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.