Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య సమంత విడాకుల అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. చైతు లవ్ స్టోరీ సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్నారు. కాగా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను బిజీ అయిపోయారు చైతన్య. మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకతవరంలో రూపొందుతున్న చిత్రం థాంక్యూ. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీలో నాగ చైతన్య కి జోడీగా రాశీ ఖన్నా, అవికా గోర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు చైతన్య. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మరోవైపు బంగార్రాజు చిత్రం షూటింగ్ షెడ్యూల్ లో కూడా పాల్గొన్నారు చైతు. ప్రస్తుతం ఈ బృందం మైసూర్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నందినీ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు చైతు. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్ లో కూడా చైతన్య నటిస్తున్నట్టు తెలుస్తుంది. అమెజాన్ వేదిక గా హారర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ కి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. అయితే వచ్చే ఏడాది జనవరిలో ఈ సిరీస్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నాడు చైతన్య. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న” లాల్ సింగ్ చద్దా “సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాలో చై ఆర్మీ జవాన్ గా కనిపించనున్నాడు.