Homeఎంటర్టైన్మెంట్Akhanda 2 Movie 5 Days Collections: 'అఖండ 2' 5 రోజుల వరల్డ్ వైడ్...

Akhanda 2 Movie 5 Days Collections: ‘అఖండ 2’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ ప్రాంతం లో జీరో షేర్!

Akhanda 2 Movie 5 Days Collections: వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) స్పీడ్ కి ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగా నిల్చింది. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో వచ్చే సినిమా ఫ్లాప్ అవ్వడం అసాధ్యం అని ట్రేడ్ లో ఒక బలమైన నమ్మకం ఉండేది. ఆ నమ్మకం ఈ సినిమాతో పోయింది అనే చెప్పాలి. భారీ అంచనాల నడుమ […]

Akhanda 2 Movie 5 Days Collections: వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) స్పీడ్ కి ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగా నిల్చింది. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో వచ్చే సినిమా ఫ్లాప్ అవ్వడం అసాధ్యం అని ట్రేడ్ లో ఒక బలమైన నమ్మకం ఉండేది. ఆ నమ్మకం ఈ సినిమాతో పోయింది అనే చెప్పాలి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే మొదటి రోజు నూన్ షోస్, మ్యాట్నీ షోస్ కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. కానీ గత నాలుగు చిత్రాల ద్వారా బాలయ్య జనాల్లో సంపాదించిన నమ్మకం కారణంగా, ఈ చిత్రానికి వీకెండ్ వరకు డీసెంట్ స్థాయి వసూళ్లను అందించారు ఆడియన్స్. అలా 5 రోజులు పూర్తి చేసుకొని ఆరవ రోజులోకి అడుగుపెట్టింది ఈ చిత్రం.

అయితే ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 5 రోజుల్లో వచ్చిన వసూళ్ళని చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం అని మరోసారి స్పష్టంగా తెలుస్తోంది. 5 వ రోజున ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి 73 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 2 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ప్రాంతాల వారీగా 5 రోజుల్లో వచ్చిన వసూళ్లను చూస్తే నైజాం ప్రాంతం నుండి 15 కోట్ల 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, సీడెడ్ ప్రాంతం నుండి 10 కోట్ల 22 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 4 కోట్ల 64 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా నుండి 3 కోట్ల 67 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 2 కోట్ల 68 లక్షలు వచ్చాయి.

అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 4 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, కృష్ణ జిల్లా నుండి 3 కోట్ల 20 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 2 కోట్ల 39 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 47 కోట్ల 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ దాదాపుగా 76 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా లో కర్ణాటక నుండి 5 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఓవర్సీస్ నుండి 4 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 57 కోట్ల 29 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 96 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈరోజు లేదా రేపటి లోపు ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఈ చిత్రం ఇంకా 46 కోట్ల 71 లక్షల రూపాయిలు రాబట్టాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper