Homeఎంటర్టైన్మెంట్Aggipette Macha: అంత్యక్రియలకు నోచుకోని అగ్గిపెట్టె మచ్చ..సొంత వాళ్ళే శత్రువులు అయిపోయారు!

Aggipette Macha: అంత్యక్రియలకు నోచుకోని అగ్గిపెట్టె మచ్చ..సొంత వాళ్ళే శత్రువులు అయిపోయారు!

Aggipette Macha: అగ్గిపెట్టె మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ మరణించడం తో , ఆయన అభిమానులు సోషల్ మీడియా లో తీవ్రమైన విచారణ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్గిపెట్టె మచ్చ కి సంబంధించిన పాత వీడియోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ, పాత జ్ఞాపకాలను పంచుకుంటున్నారు నెటిజెన్స్. అయితే అగ్గిపెట్టె మచ్చ కి ఇప్పటి వరకు అంత్యక్రియలు జరగలేదు అనే విషయం మీకు తెలుసా?, మొన్న జరగాల్సిన అంత్యక్రియలు ఇప్పటి వరకు జరగలేదు. కారణం […]

Aggipette Macha: అగ్గిపెట్టె మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ మరణించడం తో , ఆయన అభిమానులు సోషల్ మీడియా లో తీవ్రమైన విచారణ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్గిపెట్టె మచ్చ కి సంబంధించిన పాత వీడియోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ, పాత జ్ఞాపకాలను పంచుకుంటున్నారు నెటిజెన్స్. అయితే అగ్గిపెట్టె మచ్చ కి ఇప్పటి వరకు అంత్యక్రియలు జరగలేదు అనే విషయం మీకు తెలుసా?, మొన్న జరగాల్సిన అంత్యక్రియలు ఇప్పటి వరకు జరగలేదు. కారణం మచ్చ కుటుంబ సభ్యులు అందుకు ఆసక్తి చూపకపోవడమే. సొంత కుటుంబ సభ్యులు చివరికి అగ్గిపెట్టె మచ్చ ని అనాధాని చేసేశారు . ఇంతటి దారుణం ఈమధ్య కాలం లో ఎక్కడ జరగలేదు అనుకోవచ్చు. వాళ్ళు అగ్గిపెట్టె మచ్చ శవాన్ని అనాధని చేయడానికి ముఖ్య కారణం ఆస్తి గొడవలే. మాకు రావాల్సిన ఆస్తులు మా పేరు మీద రాసినప్పుడే మచ్చ కి అంత్యక్రియలు చేస్తామని తెగేసి చెప్పారట.

కానీ అందుకు మచ్చ అక్క ఒప్పుకోలేదు. దీంతో నిన్నటి వరకు అగ్గిపెట్టె మచ్చ కి అంత్యక్రియ కార్యక్రమాలు జరగలేదు. కనీసం ఈరోజైన చేస్తారో లేదో తెలియాలి. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవ్వరూ అంత్యక్రియ కార్యక్రమాలు చేయడానికి ముందుకు రాకపోతే , మచ్చ ని అభిమానించే జనాలే ఆ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. బ్రతికి ఉన్నప్పుడు ఎలాగో ఆప్యాయత చూపించడానికి ఇష్టపడరు , కనీసం చనిపోయిన తర్వాత అయినా చూపించాలి కదా , పైగా ఆస్తులు ఇస్తే తప్ప అంత్యక్రియలు చెయ్యం అని చెప్పడం అమానవీయం. ఇలాంటి వాళ్ళను కేవలం సినిమాల్లోనే చూసేవాళ్ళం , కానీ బయట కూడా అలాంటోళ్ళు ఉంటారని ఈరోజే తెలిసింది. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించిన అగ్గిపెట్టె మచ్చ కి ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అగ్గిపెట్టె మచ్చ విషయానికి వస్తే , ఈయనకు 22 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయం లో తలకు పెద్ద గాయం అవ్వడం వల్ల తన అక్క ని తప్ప అందరినీ మర్చిపోయాడు. ప్రమాదానికి ముందు అగ్గిపెట్టె మచ్చ కొన్ని రోజులు ఫోటోగ్రాఫర్ గా పని చేసాడు , మరికొన్ని రోజులు లారీ క్లీనర్ గా కూడా పని చేసాడు. 2019 వ సంవత్సరం లో అగ్గిపెట్టె మచ్చ కి సంబంధించిన మొదటి వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యింది. ఆ వీడియో లో ‘ఎగిరి తంతా నీ అక్క’ అంటూ మచ్చ వాడిన బూతులు ఆరోజుల్లో సెన్సేషన్ అయ్యింది. ఆ వీడియో బాగా వైరల్ అవ్వడం తో , అగ్గిపెట్టె మచ్చ ని ఉపయోగించుకొని వందల వీడియోస్ చేశారు యూట్యూబర్స్. అలా లాక్ డౌన్ తర్వాత జెన్ జీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

యూట్యూబర్స్ ద్వారా అగ్గిపెట్టె మచ్చ కి డబ్బులు బాగానే వచ్చాయి. ఒక్క రోజుకి గానూ ఆయనకు 10 వేల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు అట. సోషల్ మీడియా లో వచ్చిన పాపులారిటీ కారణంగా అగ్గిపెట్టె మచ్చ కి సినిమాల్లో , టీవీ షోస్ లో కూడా అవకాశాలు వచ్చాయి. కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తుంది అనుకునేలోపు ఆరోగ్య పరిస్థితులు అనుకూలించకపోవడం , చివరికి ఇలా చనిపోవడం జరిగింది. అగ్గిపెట్టె మచ్చ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper