Bigg Boss 10 Telugu: నిన్నటి ఎపిసోడ్ లో రోహిత్ , షాలిని జంట ‘రోడ్ తో రీ లోడ్’ టాస్క్ లో ఓడిపోయి అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేశారు. ముఖ్యంగా రోహిత్ అయితే దారుణంగా విఫలం అయ్యాడు. కనీసం రోహిత్ టాస్క్ ని కూడా పూర్తి చేయలేకపోయాడు. ముకేశ్, అపూర్వ లు పెట్టిన ఫజిల్ ని పక్కన నుండి చూసి పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ విఫలం అయ్యాడు. దీంతో ఆయన పై సోషల్ మీడియా లో తీవ్రమైన విమర్శలు ఎదురు అయ్యాయి.
అభిమానులకు కూడా రోహిత్ ఎందుకు ఇంత చెత్తగా ఆడాడో అర్థం అవ్వలేదు. రోహిత్ , షాలిని లకు బ్యాడ్ టైం వేరే లెవెల్ లో నడుస్తోంది. ‘రోడ్ టు రీలోడ్’ టాస్కుల్లో అందరికంటే తక్కువ పాయింట్స్ ని సొంతం చేసుకుంటే ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉంది.
ఇలా అయితే కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే నేటి ఎపిసోడ్ లో షాలిని దుమ్ము లేపేసింది అని చెప్పొచ్చు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా రోహిత్ విఫలం అయ్యాడు కానీ , షాలిని అసలు విఫలం అవ్వలేదు. ఇక నేటి ఎపిసోడ్ లో రెండవ టాస్క్ జంటగా ఆడేది కాదు. సోలో గా ఆడే ఆట. నిన్న ఎపిసోడ్ చివర్లో ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. ఈ ఆట లో అమన్ , అపూర్వ , ముకేశ్, రామ్ ప్రసాద్ లతో పోటీ పడింది షాలిని. ప్రోమో ప్రకారం చూస్తే, షాలిని ఆరంభం లోనే క్రింద పడిపోతుంది. ఆ తర్వాత మళ్లీ టాస్క్ ని రీ స్టార్ట్ చేస్తుంది.
అందరి కంటే చివర్లో టాస్క్ ని మొదలు పెట్టినప్పటికీ రెండవ స్థానం లో పూర్తి చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. ఈ టాస్క్ లో అమన్ 100 పాయింట్స్ గెలిచి మొదటి స్థానం లో నిలబడగా , షాలిని 80 పాయింట్స్ ని గెలిచి రెండవ స్థానంలో, ముకేశ్ 3 వ స్థానంలో, రామ్ ప్రసాద్ 4 వ స్థానం లో , అపూర్వ 5 వ స్థానం లో నిలిచారు. దీంతో షాలిని ని తక్కువ చేసిన హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం లీడర్ బోర్డు లో ఏయే జంట ఎక్కువ పాయింట్స్ సాధించారో చూస్తే, అమన్ -త్రిగున్ 180 పాయింట్స్ తో మొదటి స్థానం లో ఉండగా, ముకేశ్ -ఝాన్సీ జంట మరియు అపూర్వ -చరణ్ జంట చెరో 120 పాయింట్స్ తో రెండవ స్థానం లో , 100 పాయింట్స్ తో రోహిత్ -షాలిని జంట మూడవ స్థానంలో , 80 పాయింట్స్ తో రామ్ ప్రసాద్ -నరేష్ జంట ఉన్నారు. ఈరోజు ఆడే టాస్క్ తో , లీడర్ బోర్డు లో స్థానాలు మొత్తం మారిపోనున్నాయి.