spot_img
Homeఎంటర్టైన్మెంట్Major Censor Review: మేజర్ సెన్సార్ రివ్యూ ఇదే.. గొప్ప చిత్రం అట...

Major Censor Review: మేజర్ సెన్సార్ రివ్యూ ఇదే.. గొప్ప చిత్రం అట !

Major Movie Censor Review: టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ టాలెంటెడ్ హీరోల్లో ‘అడవి శేష్’ ఒకరు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ… వరుసగా క్షణం, గూఢచారి, ఎవరు మూవీలతో విజయాలను సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 3న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌బోతున్నారు.

Major Movie Censor Review
Adivi Sesh

తాజాగా మేజర్ సినిమాకి సెన్సార్ అయ్యింది. యూ/ఏ సర్టిఫికెట్‌ తో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా గురించి సెన్సార్ రిపోర్ట్ విషయానికి సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. సినిమాలో మంచి ఫీల్ ఉందని.. అలాగే దేశభక్తికి సంబంధించి కూడా ఈ చిత్రం గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని తెలుస్తోంది. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read: Tollywood Heros: తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే అయిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏది ఏమైనా ‘అడివి శేష్’ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన పేద కళాకారుడిగా ఎన్నో ఇబ్బందులు పడి నేడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.

Major Movie Censor Review
Adivi Sesh

జీరో నుంచి మైనస్ లోకి వెళ్లి, ప్రస్తుతం పది కోట్లు మార్కెట్ ను క్రియేట్ చేసుకుని వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. తనకు మాత్రమే సాధ్యం అన్నట్టు వైవిధ్యమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న అడివి శేష్ కి, లేడీస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

కాగా, ఈ మేజర్ సినిమాను జి.ఎమ్‌.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మిస్తోంది. శ్రీ చరణ్ పాకల ఈ మూవీకి సంగీత దర్శకుడు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషలలో విడుదలవబోతుంది.

Also Read:Samantha: సమంత గ్లామర్ షో.. మత్తెక్కించింది, మతి పోగొట్టింది !
Recommended videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper