Kamal Hassan Behavior : కమల్ హాసన్.. లోక నాయకుడే కాదు.. అంతకుమించిన గ్రంథ సాంగుడు. స్వేచ్ఛా పిపాసుడు.. ఎంతమందిని ప్రేమించాడు.. జీవితంలోకి ఆహ్వానించిన వారితో చక్కగా ఉండలేక ఆ బంధాలకు అర్ధాంతరంగా ముగింపు పలికాడు. అయితే కమల్ హాసన్ ప్రేమాయణాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. మిగతావన్నీ అలా కాలగర్భంలో కలిసిపోయాయి. కమల్ జాబితాలో ఎప్పటికీ చెరగని పేరు ఒకటి ఉంది.. ఆమె శ్రీవిద్య.. పేరుకు మళయాల నటి అయినప్పటికీ తెలుగువారికి చాలా సుపరిచితం. తెలుగు వారికి చాలా సుపరిచితం.. అయితే శ్రీవిద్య,కమల్ హాసన్ మధ్య “సమ్”బంధం ఉన్నట్టు కొంతమందికి మాత్రమే తెలుసు. అందులో కుట్టి పద్మిని ఒకరు. ఆ కుట్టిపద్మిని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కమల్, శ్రీ విద్య మధ్య జరిగిన స్టోరీని బయటపెట్టారు.. ఇంతకీ కుట్టి పద్మిని ఏం చెప్పారో మీరూ చదివేయండి.
దక్షిణాది ఇండస్ట్రీలో సీనియర్ నటీమణుల్లో ఒకరు
పద్మిని దక్షిణాది ఇండస్ట్రీలో సీనియర్ నటీమణుల్లో ఒకరు.. ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించారు. తర్వాత తెలుగు, కన్నడ, మాళయాల, హిందీ భాషా మిత్రుల నటించింది. తన మూడవ ఏట అంటే 1959లో తొలిసారిగా తమిళంలో బాలనటిగా తన నట జీవితాన్ని ప్రారంభించింది. ఎంజి రామచంద్రన్, శివాజీ గణేషన్, జెమినీ గణేషన్, జై శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ ఆంటీ సూపర్ స్టార్స్ తో నటించారు. ఇప్పుడు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ బిజీ బిజీ అయిపోయారు. ఇటీవల కమల్ హాసన్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టి సంచలనానికి దారి తీశారు.
ఆరుగురుతో ప్రేమ
ముందుగానే చెప్పినట్టు కమల్ హాసన్ పెద్ద గ్రంథసాంగుడు. అప్పట్లో తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు శ్రీ విద్య, రేఖ, జయసుధ, వాణి గణపతితో సహా మరో ఇద్దరు నటీమణులతో కలిపి ప్రేమ వ్యవహారం నడిపించాడు. కానీ చివరికి వాణి గణపతిని వివాహం చేసుకున్నాడు. అప్పట్లో వీరిద్దరి పెళ్లి శ్రీదేవి, శ్రీ విద్యను ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీవిద్య కమల్ హాసన్ ను ఎంతో ఇష్టపడింది. అతడిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది. కానీ అతడికి పెళ్లి కావడంతో తీవ్ర మనోవేదనకు గురైంది.” నేను ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు కమల్ హాసన్ వాణి గణపతి తో ప్రేమలో పడ్డారు. ఎయిర్ పోర్ట్ లో ఆమెకు ఒక బహుమతి కూడా కొన్నారు. అంతేకాదు అన్నటి రేఖతో కూడా ప్రేమయాణం సాగించారు. ఈ విషయాన్ని అప్పట్లో నిన్ను శ్రీవిద్యకు నేరుగా చెప్పాను. ఆమె నమ్మలేదు.. కమల్ హాసన్ కు సకల కళా వల్లభుడు అనే బిరుదు రావడానికి ఇదే కారణం అని” కుట్టి పద్మిని పేర్కొన్నది.
తీవ్ర ఒత్తిడికి గురైంది
కమల్ వాణిని పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీ విద్యా చాలా ఒత్తిడికి గురైంది. ఈ వాస్తవాన్ని భరించలేక కొద్ది రోజులపాటు ఒంటరిగా ఉండిపోయింది. కొద్ది రోజులపాటు ఒంటరిగా ఉండిపోయింది. ఆ తర్వాత జార్జ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ కొద్ది రోజులకే విడాకులు తీసుకుంది. వయసు పైబడటంతో సినిమాల నుంచి తప్పుకుంది. తిరువనంతపురంలో స్థిరపడింది. తన ఆస్తి మొత్తాన్ని ఒక ట్రస్ట్ కు రాసి ఇచ్చింది. తర్వాత ఆమెకు క్యాన్సర్ రావడంతో 2006లో కన్ను మూసింది. అయితే శ్రీవిద్య తెలుగులో చివరిగా సుమంత్ హీరోగా నటించిన విజయ్ ఐపీఎస్ అనే సినిమాలో నటించింది.
గౌతమితోనూ ఇదే వ్యవహారం
కమల్ హాసన్ సకల కళా వల్లభుడు కాబట్టి ఎవరితోనూ సరిగ్గా ఉండడు. ఈ బంధాన్ని కూడా చిక్కబడనివ్వడు.. మొదట వాణి గణపతిని పెళ్లి చేసుకున్న అతడు తర్వాత కొద్ది రోజులకే ఆమెకు కటీఫ్ చెప్పాడు. మొదట వాణి గణపతిని పెళ్లి చేసుకున్న అతడు తర్వాత కొద్ది రోజులకే ఆమెకు కటీఫ్ చెప్పాడు. తర్వాత సారికను పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందే ఆమె కమల్ వల్ల గర్భవతి కావడంతో గత్యంతరం లేని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు సారిక ముంబైలో ఓ ఇంట్లో ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నది. తర్వాత గౌతమికి దగ్గరయ్యాడు. కొన్ని సంవత్సరాల సహజీవనం తర్వాత ఆమెకు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు పూజా కుమార్ తో కలిసి ఉంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమి కంటే ముందు శ్రీదేవి, రేఖ, సిమ్రాన్ ఇంకా చాలామంది నటీమణులతో కొనసాగించడాని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక కమల్ పెద్ద కూతురు కూడా తక్కువదేమీ కాదు. ఆమె కూడా ధనుష్, సిద్ధార్థ్, ఓ అమెరికన్ నటుడితో సంబంధాలు నెరిపినట్టు టాక్. ప్రస్తుతం ఆమె ఒక డూడుల్ ఆర్టిస్టుతో సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.. కమల్ హాసన్ గురించి ఇన్నాళ్లు ఏ నటిమణి కూడా నోరు చెప్పలేదు. కానీ కుట్టి పద్మిని మాత్రం ఆయన తెరచాటు వ్యవహారాలను తెరమందు బహిరంగంగానే వ్యాఖ్యానించింది. అందుకే కదా “పాకుడురాళ్లు” వంటి నవలలు పుట్టుకొచ్చింది.
https://www.youtube.com/watch?v=Jqm7zfkWl4I