Thug Life Collections : హీరో నితిన్(Actor Nithin) కి ఈ ఏడాది ఒక పీడకల లాగా మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. హీరోగా ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ‘రాబిన్ హుడ్'(Robin Hood) చిత్రం కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కనీసం డిస్ట్రిబ్యూషన్ రంగం లో అయినా విజయాలను చూస్తాడని ఆయన అభిమానులు అనుకున్నారు. గత కొంతకాలం గా నితిన్ కమల్ హాసన్ నిర్మాణం లో తెరకెక్కుతున్న సినిమాలకు సంబంధించిన తెలుగు వెర్షన్ రైట్స్ ని కొనుగోలు చేస్తున్నాడు. విక్రమ్ చిత్రం నుండి ఇది మొదలైంది. విక్రమ్ కమర్షియల్ గా మన తెలుగు లో కూడా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 7 కోట్ల రూపాయలకు నితిన్ ఈ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ ని కొనుగోలు చేస్తే ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి. ఎంత లాభాలు వచ్చాయో మీరే ఊహించుకోండి.
అదే విధంగా గత ఏడాది శివ కార్తికేయన్ హీరో గా నటించిన ‘అమరన్’ చిత్రం తెలుగు లో దాదాపుగా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాని కూడా కమల్ హాసన్ నిర్మించాడు. తెలుగు వెర్షన్ రైట్స్ ని నితిన్ 8 కోట్లకు కొనుగోలు చేసాడు. లాభాలు ఏ రేంజ్ లో వచ్చాయో ఈపాటికి మీకు అర్థం అయ్యే ఉంటుంది. అలా రెండు సినిమాలకు భారీ లాభాలు రావడంతో కమల్ హాసన్(Kamal Haasan) లేటెస్ట్ చిత్రం ‘థగ్ లైఫ్'(Thug Life) తెలుగు వెర్షన్ రైట్స్ ని 18 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. కానీ మొదటి రోజు కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఇక రెండవ రోజు అయితే అనేక ప్రాంతాల్లో డెఫిసిట్స్ వచ్చాయి. కనీసం 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రావడం లేదని అంటున్నారు. దీనిని బట్టీ ఈ చిత్రం ఏ రేంజ్ డిజాస్టర్ అనేది మీకు ఈపాటికి అర్థం అయ్యే ఉంటుంది.
కమల్ హాసన్ నిర్మాణం లో వచ్చిన గత రెండు చిత్రాల లాభాలను మొత్తం ఈ ‘థగ్ లైఫ్’ చిత్రం లాగేసుకుంది. దీనికి నితిన్ అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఈ ఏడాది మా అభిమాన నటుడికి ఏది కలిసిరావడం లేదని వాపోతున్నారు. ఒక సినిమాకు దాదాపుగా 15 కోట్ల రూపాయిల నష్టమంటే ఆషామాషీ విషయం మాత్రం కాదు. ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ ‘తమ్ముడు’ చిత్రం పైనే ఉన్నాయి. వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కిన ఈ చిత్రం ముందుగా జులై నాల్గవ తేదీన రావాల్సింది. కానీ విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టీం ఆ డేట్ ని మాకు వదిలేయండి అని రిక్వెస్ట్ చేయడం తో దిల్ రాజు ఈ చిత్రాన్ని జులై 25 కి వాయిదా వేశారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.