Tollywood Movie Releases : సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య చాప భారీ పోటీ నడుస్తోంది. ఇక సమ్మర్ సీజన్ మొత్తంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్కటి కూడా పెద్ద సినిమా రిలీజ్ కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు వరుసగా ముగ్గురు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ అయితే పడుతున్నారు. ఈనెల ఐదోవ తేదీన కమల్ హాసన్(Kamal Hasan), (shimbu) కలిసి నటించిన ‘థగ్ లైఫ్’ (Thag Life) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అటు కమల్ హాసన్ కి, ఇటు శింబు కి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ చెప్పడంతో అతని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో కమల్ హాసన్ ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
Also Read : హరి హర వీరమల్లు’ లో హైలైట్ అయ్యే సన్నివేశాలు ఇవే..కానీ సెకండ్ హాఫ్ రిస్క్ ఉంది!
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం చాలా రోజుల తర్వాత హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జూన్ 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికి తన అభిమానులు నిరుత్సాహపరచకూడదనే ఒకే ఒక కారణంతో ఆయన ఇప్పటికీ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి హరిహర వీరమల్లు సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. ఆయనలాంటి హీరో ఇకమీదట చేయబోయే సినిమాలతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగాలి అనేది తెలియాల్సి ఉంది…
శేఖర్ కమ్ముల (Shekar Kammula) దర్శకత్వంలో ధనుష్ (Dhanush) కీలకపాత్రలో నటిస్తున్న కుబేర(Kuberaa ) సినిమా సైతం ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వడం ఖాయం అంటూ చాలామంది అభిమానులైతే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ధనుష్ (Dhanush) ఈ సినిమాలో నటించిన నటనకు గాను అతనికి నేషనల్ అవార్డుతో పాటు ఆస్కార్ అవార్డ్ కూడా వస్తుంది అంటూ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్ చేయడం విశేషం…
ఇక ఈ ముగ్గురు స్టార్ హీరోల్లో ఏ హీరో ఈ జూన్ నెలలో భారీ సక్సెస్ ని సాధిస్తాడు. సక్సెస్ తో పాటు మిగతా హీరోలను ఓడించి విజేతగా ఎవరు నిలుస్తారు అనేది తెలియాల్సి ఉంది…