Aadarsa Kutumbam: విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి వీకెండ్ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టినప్పటికీ , వర్కింగ్ డేస్ లో మాత్రం వసూళ్లు భారీగా డౌన్ అయ్యాయి. నాల్గవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , 5 వ రోజున కేవలం 1 కోటి 36 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఓవరాల్ గా మొదటి 5 రోజులకు కలిపి 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, వరల్డ్ వైడ్ గా 32 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 61 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.
ఓవరాల్ గా ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకేసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ నుండి 2 కోట్ల 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు నైజాం ప్రాంతం లో 17 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, సీడెడ్ లో 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం ప్రాంతం లో దీపావళి వీకెండ్ వల్ల బ్రేక్ ఈవెన్ మార్కు కి చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ , సీడెడ్ ప్రాంతం లో మాత్రం బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి విడుదలకు ముందు 20 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
5 రోజులకు కలిపి 9 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , ఓవర్సీస్ నుండి 6 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో విడుదలకు ముందు ఈ చిత్రానికి 13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం కాబట్టి , కచ్చితంగా ఈ చిత్రం ఓవర్సీస్ లో డబుల్ డిజాస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కర్ణాటక +రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా ఈ చిత్రం డబుల్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.