Kurup: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన పాన్ ఇండియా సినిమా కురుప్. శుక్రవారం నవంబరు 12న ఈ సినిమా విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల రోజే వివాదాల్లో చిక్కుకుంది. కేరళలోని కొచ్చికి చెందిన ఓ వ్యక్తి ఈ సినిమాకు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. పిల్ ప్రకారం నేరస్థుడైన సుకుమార కురుప్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే, ఈ సినిమా వల్ల కురుప్ గోప్యతను ఉల్లంఘించే అవకాశం ఉందని సదరు వ్యక్తి వాదన. ఈ పిల్‌పై స్పందించిన కేరళ హైకోర్టు సినిమా సినిమా విడుదలపై ఎలాంటి స్టేను విధించలేదు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇంటర్‌పోల్, చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
వేఫేరర్ ఫిల్మ్స్, ఎం స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై 35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. సినిమాకు శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్ ఇందులో ప్రధాన పాత్తర పోషించారు. దాదాపు ఆరు నెలల పాటు సాగిన ఈ సినిమా షూటింగ్.. ఎట్టకేలకు విడుదలైంది.
కేరళ, ముంబయి, దుబాయ్, మంగళూరు, మైసూర్, అహ్మదాబాద్‌ల్లో 105 రోజుల పాటు ఈ సినిమా తీశారట. గతంలోనే విడుదలవ్వాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. శోభిత కథానాయిక. ఇంద్రజిత్ సుకుమారన్, సన్నీ వేన్ కీలక పాత్రలు పోషించారు. సుషిన్ శ్యామ్ సంగీతం అందించగా.. నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మలయాళం, తెలుగుతో పాటు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదలైంది.