Hari Hara Veeramallu Movie : మరో 16 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు 5 ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం విడుదల కాబోతుంది. నేడే ఈ సినిమాకు సంబంధించిన మొదటి కాపీ సిద్ధమైపోయింది. సౌండ్ మిక్సింగ్ తో మేకర్స్ ఈ మొదటి కాపీని వీక్షించారు. రేపటితో బ్యాక్ గ్రౌండ్ వర్క్, రీ రికార్డింగ్ కూడా పూర్తి అవుతుంది. అప్పుడు మరోసారి పూర్తిస్థాయిలో ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్రాన్ని వీక్షించబోతున్నారు మూవీ టీం. వాళ్ళ అంచనా ప్రకారం ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొడుతుందని,కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే కాకుండా హిందీ వెర్షన్ కూడా దంచేస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు. సినిమా అంత అద్భుతంగా వచ్చిందట. ఆరు యాక్షన్ సన్నివేశాలు కళ్ళు చెదిరే రేంజ్ లో వచ్చాయని, పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇలాంటి సినిమాని మళ్ళీ చూడలేరని అంటున్నారు.
Also Read : ఓటీటీ లోకి వచ్చేసిన మోహన్ లాల్ ‘తుడరం’ చిత్రం..ఎందులో చూడాలంటే!
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్ని ప్రాంతాల్లో పూర్తి అయ్యాయి. మలయాళం వెర్షన్ కి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని అక్కడి స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) భారీ రేట్ కి కొనుగోలు చేసినట్టు సమాచారం. కేరళలో ఆయన ఆయన ఈ సినిమాకు భారీ రిలీజ్ ఇవ్వబోతున్నాడు. సుమారుగా మూడు కోట్ల రూపాయలకు ఆయన ఈ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. కేరళ లో పవన్ కళ్యాణ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన అనేక సినిమాలకు అక్కడ మొదటి రోజు భారీ ఓపెనింగ్ వసూళ్లు కూడా వచ్చాయి. అంతే కాకుండా కేరళ లో 35 వేల మంది తెలుగు ప్రజలు స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజిలలో చదువుకునే వాళ్ళు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ‘హరి హర వీరమల్లు’ కి టాక్ వస్తే మంచి ఓపెనింగ్ ఇక్కడి నుండి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బయ్యర్స్ లిస్ట్ మరో రెండు రోజుల్లో ఖరారు కానుంది. నైజాం ప్రాంతం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. సుమారుగా 36 కోట్ల రూపాయిల అడ్వాన్స్ అందుకోసం చెల్లించినట్టు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నారు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శోభన్ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో ఇది కూడా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా థియేట్రికల్ రైట్స్ ని భాస్కర్ రెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల థియేట్రికల్ రైట్స్ ని ఉషా మూవీస్ వారు దక్కించుకున్నారట. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ బిజినెస్ ని అడ్వాన్స్ బేసిస్ మీదనే చేస్తున్నారట మేకర్స్. అంటే అడ్వాన్స్ రీకవర్ అయ్యాక, వచ్చే లాభాలు మొత్తం నిర్మాత జోబుల్లోకి వెళ్తాయి అన్నమాట. చూడాలి మరి ఈ చిత్రం కమర్షియల్ గా ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది.