సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందే అని అభిమానులు ఆందోళనలు చేపడుతూ ధర్నాలు చేస్తోన్న సంఘటనలు కూడా తమిళనాడులో జరుగుతున్నాయి. వీట్ని ముందే ఆపకపోతే, అసలుకే ఎసరు వస్తోంది అనుకున్న సూపర్ స్టార్, అభిమానుల ఆందోళనలపై తన బాధను తెలియజేస్తూ ఓ భావోద్వేగ లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ రజిని ఏమి పోస్ట్ చేశాడు అంటే.. “ఆరోగ్య పరిస్థితుల వలన నేను రాజకీయాల్లోకి రానని చెప్పాను. కానీ ఇప్పుడు నా నిర్ణయం మార్చుకోమని నాపై ఒత్తిడి చేయకండి. ఇప్పటికే రాజకీయాల్లోకి రాకపోవడానికి గల కారణాలను నేను వివరంగా చెప్పాను. ఇప్పుడు ఇలాంటి ఆందోళనలు చేసి నన్ను బాధపెట్టొద్దు. నా నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ ఒత్తిడి తీసుకురావొద్దు. నేనూ మీ ఆందోళనతో చాలా బాధపడ్డాను. ఇప్పటికైన నన్ను అర్థం చేసుకోని ఆందోళనలు చేయకండి” అని రజిని పేర్కోన్నారు.
Also Read: ‘ఎన్టీఆర్, పవన్, చరణ్’ రికార్డ్స్ పై బన్నీ కామెంట్స్ !
ఈ పోస్ట్ చూశాక రజిని నిజంగా ఎంత ఫీల్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఆయన బాధను అర్ధం చేసుకోవాల్సిన ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఆందోళనలు చేసుకుంటూ ముందుకుపోతున్నారు. రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టాల్సిందే అంటూ రెచ్చిపోతున్నారు. సూపర్ స్టార్ దయచేసి మీ నిర్ణయమని మార్చుకొండి అంటూ ఆయన ఇంటివద్ద, చెన్నైలో పలుచోట్ల ఆందోళనకు దిగుతున్నారు అభిమానులు. ఈ రోజు ఉదయం కూడా కొంతమంది “వా తలైవ వా” (రా తలైవా రా) అంటూ చెన్నైలో అభిమాన సంఘాలు ర్యాలీ కూడా నిర్వహించాయట.
Also Read: హర్ష కాబోయే భార్య ఎవరో తెలుసా? నాలుగేళ్లు డేటింగ్ అట !
అసలు రజినీకాంత్ స్పందించన తరువాత కూడా, అభిమానులు ఇలా ప్రవర్తించడం నిజంగా బాధాకరమైన విషయమే. తాజాగా అభిమానులనుద్దేశించి రజిని మాట్లాడుతూ.. “నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఈ విషయంలో గొడవ చెయ్యకండి. నేను ఎందుకు రాజకీయాల ఆలోచన విరమించుకున్నానో ఇప్పటికే స్పష్టం చేశాను. దయచేసి మళ్ళీ దీని గురించి అడగొద్దు,” అని రజిని అభిమానులను వేడుకుంటున్నాడు. పాపం సూపర్ స్టార్ ఇమేజ్ కూడా రజినిని బాధ పెడుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Dont cause me pain rajinikanth requests fans
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com