Shankar : సౌత్ ఇండియా లోనే టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటి లైకా ప్రొడక్షన్స్(Lyca Productions). తమిళ హీరో విజయ్ నటించిన ‘కత్తి’ చిత్రం తో ఈ సంస్థ అధినేత సుబాస్కరన్(Subhaskaran) కెరీర్ మొదలైంది. ఆ సినిమా కమర్షియల్ గా అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలను అందుకున్న లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ సినిమాల వైపు కన్నేసి చేతులు కాల్చుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్(Director Shankar) సుబాస్కరన్ ని నట్టేట ముంచేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అనవసరమైన వాటికి ఇష్టమొచ్చినట్టు ఖర్చులు పెట్టించడమే కాకుండా, షూటింగ్ విషయం లో జాప్యం చేయడంతో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా ‘2.0’ చిత్రానికి 530 కోట్ల రూపాయిలు ఖర్చు చేశారట. సినిమా విడుదల తర్వాత ఈ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. 300 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, దాదాపుగా థియేట్రికల్ పరంగా 230 కోట్ల నష్టాన్ని మిగిలించింది.
Also Read : డైరెక్టర్ శంకర్ కి కోలుకోలేని షాక్..ఆస్తులను సీజ్ చేసిన ఈడీ..అసలు ఏమైందంటే!
ఇప్పుడంటే ఓటీటీ రైట్స్ భారీ రేట్స్ కి అమ్ముడుపోతున్నాయి కానీ, అప్పట్లో ఆ రేంజ్ ఉండేది కాదు. దీంతో డిజిటల్ రైట్స్ కూడా అనుకున్న రేంజ్ కి అమ్ముడుపోకపోవడంతో నష్టం మరింత పెరిగింది. ఇక ఈ సినిమా తర్వాత విడుదలైన ‘ఇండియన్ 2’ ఎలాంటి డిజాస్టర్ ఫ్లాప్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా ఈ రెండు సినిమాల కారణంగా ఆర్థికంగా బాగా నష్టపోయారు. ఇక ఆ తర్వాత రజినీకాంత్(Super star Rajinikanth) తో చేసిన ‘లాల్ సలామ్’ చిత్రం అయితే కనీసం ప్రింట్ ఖర్చులను కూడా రాబట్టలేని రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కనీసం ‘విడాముయార్చి’ చిత్రం తో అయినా బయటపడుతారని అనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ముందుగా ఈ చిత్రాన్ని జనవరి 10 న విడుదల చేద్దామని అనుకున్నారు.
కానీ ఈ సినిమా హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘బ్రేక్ డౌన్’ కి కాపీ అనే విషయాన్ని తెలుసుకొని, ఆ మూవీ మేకర్స్ లైకా ప్రొడక్షన్స్ పై ఫైన్ విధించారు. అందుకే వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత నెలలో విడుదలైన ఈ సినిమా అభిమానులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నెట్ ఫ్లిక్స్ లో కూడా రెస్పాన్స్ అంతంత మాత్రం గానే రెస్పాన్స్ ని దక్కించుకుంది. దీంతో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ సినిమా ఇండస్ట్రీ నుండి పూర్తిగా తప్పుకోవాలనే నిర్ణయం తీసుకుందట. అందులో భాగంగానే మోహన్ లాల్ తో తీస్తున్న లూసిఫెర్ సీక్వెల్ ‘L2 – empuran’ మూవీ నుండి తప్పుకుంది. ఈ సినిమాతో పాటు ప్రొడక్షన్ లో ఉన్న మిగిలిన సినిమాలను కూడా అమమ్యెల్యేని అనుకుంటున్నారట.
Also Read : శంకర్ ‘భారతీయుడు 3’ సినిమాను ఆ ఓటిటి సంస్థ కొనుగోలు చేసిందా..?