Rajinikanth and Kamal Haasan : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాల నుంచి రజినీకాంత్ (Rajinikanth) కమల్ హాసన్(Kamal Hasan) లాంటి హీరోలు వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఇద్దరు హీరోలదే హవా అన్నట్టుగా ఒకానొక సమయంలో వరుస సినిమాలతో సక్సెస్ లను సాధిస్తూ నెంబర్ వన్ హీరో ఎవరు అనే దానిమీద తీవ్రమైన కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతూ వచ్చారు. మరి ఎట్టకేలకు రజనీకాంత్ ఎప్పటికప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీ హిట్ల ను అందుకుంటూ కమల్ హాసన్ కు అందనంత రేంజ్ లో ముందుకు దూసుకెళ్లడం అనేది ఒక రకంగా రజనీకాంత్ నెంబర్ వన్ హీరోగా ఎదగడానికి చాలా వరకు దోహద పడిందనే చెప్పాలి. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు రజనీకాంత్ స్టార్ డమ్ ని మ్యాచ్ చేసే హీరోగాని ఆయన మార్కెట్ ను బీట్ చేసే హీరో గాని మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read : రజినీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్ లకు పాలిటిక్స్ కలిసి రాలేదు…మరి విజయ్ పరిస్థితి ఏంటి..?
మరి అలాంటి స్టార్ హీరో చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ సినిమాలను చేయడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తూ ఉంటాడు. ఇక రజనీకాంత్ మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముత్తు, భాషా, నరసింహ, చంద్రముఖి లాంటి సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు.
కానీ కమల్ హాసన్ మాత్రం ఆర్ట్ సినిమాల వైపు ఎక్కువగా తన దృష్టిని కేంద్రీకరించడంతో ఆయన మాస్ లో ఎక్కువగా ఇమేజ్ ను మూటగట్టుకోలేకపోయాడు. తద్వారా అతనికి బీ,సీ సెంటర్లో అభిమానులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారనే చెప్పాలి. ఇక దానివల్లే ఆయన మార్కెట్ అనేది భారీ రేంజ్ లో పెరగలేకపోయింది. ఇక రజనీకాంత్ స్టార్ డమ్ అనేది రోజురోజుకు విస్తరించడంతో కమల్ హాసన్ సక్సెస్ ను సాధించినప్పటికి భారీ కలెక్షన్స్ మాత్రం కొల్లగొట్టలేకపోయాడు.
అందుకే అప్పటినుంచి ఇప్పటివరకు రజనీకాంత్ స్టార్ డమ్ ని కమల్ హాసన్ అందుకోలేకపోతున్నాడు. ఇక ఇప్పటికీ కూడా రజనీకాంత్ వరుస సినిమాలతో మంచి విజయాలను సాధించాలని ధృడ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉండడం విశేషం. గత సంవత్సరం జైలర్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు కూలీ సినిమాతో పెను ప్రంభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు… ఇక ఈ సినిమా సైతం సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే రజినీకాంత్ స్టార్ డమ్ ను మ్యాచ్ చేసే హీరోలు మరెవరు ఉండరు అనేది మరోసారి ప్రూవ్ అవుతుందనే చెప్పాలి…
Also Read : కమలహాసన్ రజినీకాంత్ ఇద్దరి గురువు ఒక్కరే అనే విషయం మీకు తెలుసా..?