Jailer 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రజినీకాంత్ (Rajinikanth) తన సినిమాలను తెలుగులో సైతం డబ్ చేసి ఇక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో పోటీపడుతూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ‘కూలీ’ (Cooli) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మొత్తం పూర్తి అయిపోయిన నేపధ్యం లో తను తొందర్లోనే జైలర్ 2(Jailer 2) సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలూస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది యంగ్ హీరోలు స్టార్ హీరోలు కొన్ని క్యామియో రోల్స్ పోషించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని (Nani) ఒక కీలక పాత్రలో నటించబోతున్నారట…ఇక తను కాకుండా ప్రభాస్ సైతం ఈ సినిమాలో ఒక క్యామిరోల్ పోషించబోతున్నాడనే వార్తలై తే వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ప్రభాస్ ‘కన్నప్ప’ సినిమాలో కూడా ఒక కీలక పాత్రను పోషించాడు.
Also Read: విక్రమ్ మాస్ విశ్వరూపం.. దుమ్ములేపేసిన ‘వీర ధీర సూర’ టీజర్.. ఈసారి గురి తప్పేలా లేదు!
దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో సైతం ఒక పర్ఫెక్ట్ సీన్ లో ప్రభాస్ ని వాడుకోబోతున్నారట. రజనీకాంత్ ఈ విషయాన్ని ప్రభాస్ తో మాట్లాడి మరీ అతన్ని ఒప్పించినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ సాధిస్తే ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఈ ఏజ్ లో కూడా భారీ ఇండస్ట్రీ హిట్ ని సాధించిన హీరోగా మంచి రికార్డులను సృష్టిస్తాడు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో భారీ విజయాలను సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక రజనీకాంత్ ఒకప్పుడు చేసిన సినిమాలన్ని భారీ విజయాలను సాధించాయి. కానీ ఈ మధ్య చేస్తున్న సినిమాలతో కొంతవరకు డీలా పడుతున్నాడ.
ఇక మొత్తానికైతే జైలర్ (Jailer) సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి పాన్ ఇండియాలో భారీ విజయాన్ని అందుకుంది. మరి ఇప్పుడు చేస్తున్న సినిమా యావత్ తమిళంలో ఇండస్ట్రీ హిట్ ని సాధిస్తుందని తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డులను కూడా నెలకొల్పుతుందని అతని అభిమానులు భావిస్తున్నారు…
Also Read: మహేష్ , రాజమౌళి మూవీ సెట్స్ లో హోలీ ఆడిన హీరోయిన్ ప్రియాంక చోప్రా..వైరల్ అవుతున్న ఫోటోలు!