https://oktelugu.com/

కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు షాక్.. ఆ సమస్య..?

కరోనా వైరస్ సోకిన వాళ్లలో కొంతమంది స్టిరాయిడ్స్ వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే స్టిరాయిడ్స్ వాడిన వాళ్లలో ఎక్కువమందికి కరోనా నుంచి కోలుకున్న తరువాత ఎముకలు బలహీనపడుతున్నాయని సమాచారం. మరి కొంతమందిలో ఎముకలు పెలుసులా మారి విరిగిపోతున్నాయని సమాచారం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమందిలో ఈ సమస్యలను గుర్తించామని ఆర్థోపెడిక్ వైద్యులు చెబుతున్నారు. తుంటి, వెన్ను, మణికట్టు ప్రాంతాల్లో ఎముకలు చిట్లడంతో ఎక్కువమంది ఈ సమస్యలతో బాధ పడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమంది […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 4, 2021 / 02:00 PM IST
    Follow us on

    కరోనా వైరస్ సోకిన వాళ్లలో కొంతమంది స్టిరాయిడ్స్ వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే స్టిరాయిడ్స్ వాడిన వాళ్లలో ఎక్కువమందికి కరోనా నుంచి కోలుకున్న తరువాత ఎముకలు బలహీనపడుతున్నాయని సమాచారం. మరి కొంతమందిలో ఎముకలు పెలుసులా మారి విరిగిపోతున్నాయని సమాచారం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమందిలో ఈ సమస్యలను గుర్తించామని ఆర్థోపెడిక్ వైద్యులు చెబుతున్నారు.

    తుంటి, వెన్ను, మణికట్టు ప్రాంతాల్లో ఎముకలు చిట్లడంతో ఎక్కువమంది ఈ సమస్యలతో బాధ పడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమంది కండరాల నొప్పులతో బాధపడుతున్నారు. వైద్యులు రోగి పరిస్థితి విషమంగా ఉంటే స్టిరాయిడ్లు ఇస్తున్నారు. ఫలితంగా రోగి వైరస్ నుంచి కోలుకున్నా ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కొంతమందిలో ఆస్టియోపొరాసిస్‌ సమస్య వస్తోందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

    కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మధుమేహం, థైరాయిడ్‌, గుండె జబ్బులతో బాధ పడేవాళ్లు కరోనా సోకడం వల్ల స్టెరాయిడ్స్‌ వాడితే ఎముకల బలం బాగా తగ్గిపోతుందని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. కరోనా సోకి కోలుకున్న వాళ్ల వయస్సు 50 సంవత్సరాలు దాటితే వాళ్లు కాల్షియం, డి విటమిన్ తప్పనిసరిగా తీసుకోవాలి.

    సరైన వ్యాయామాలు చేయడం ద్వారా కూడా ఈ సమస్యను సులభంగా అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయి. కొందరికి తుంటి లో బాలును రీప్ల్లేస్‌ చేయాల్సి వస్తుందని కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ఫైబ్రోమైయాల్జియా సమస్యతో ఎక్కువగా బాధ పడుతున్నారని వైద్య నిపుణులు పేర్కొన్నారు.