Site icon OkTelugu

Vijay Deverakonda Rashmika Mandanna Wedding: దేశవ్యాప్తంగా అన్నదానాలు చేయబోతున్న విజయ్ దేవరకొండ,రష్మిక జంట..చరిత్రలో ఇదే తొలిసారి!

Vijay Deverakonda Rashmika Mandanna Wedding

Vijay Deverakonda Rashmika Mandanna Wedding

Vijay Deverakonda Rashmika Mandanna Wedding: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) పెళ్ళికి సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ అప్లోడ్ చేసిన పెళ్లి ఫోటోలకు 20 మిల్లియన్లకు పైగా లైక్స్ రాగా , రష్మిక మందాన అప్లోడ్ చేసిన పెళ్లి ఫోటోలకు 26 మిల్లియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. రష్మిక పోస్ట్ కి వచ్చిన లైక్స్ ఇండియా లోనే ఆల్ టైం రికార్డు గా నిల్చింది. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, ఈ జంటకు యూత్ ఆడియన్స్ లో ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిది అనేది. ఇదంతా పక్కన పెడితే తమని ఇంతలాగా అభిమానిస్తున్న జనాలకు ప్రేమతో ఈ జంట చేయబోతున్న ఒక గొప్ప పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇండియా లో ఇప్పటి వరకు e జంట కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయలేదు .

Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ జంట దేశం లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఉండే దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం చేయబోతున్నారు. అంతే కాకుండా ప్రతీ ఒక్కరికి స్వీట్లు పంచే కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరు మాట్లాడుతూ ‘మమ్మల్ని ఇంతలా అభిమానిస్తున్న ఈ దేశప్రజలకు ధన్యవాదాలు. మా అందమైన జర్నీ కి మీ ప్రేమ కూడా ఉంది. అందుకే మా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని మీతో కలిసి జరుపుకోవాలని అనుకుంటున్నాము. అందుకే మార్చి 1న మీ అందరికి ట్రక్కుల ద్వారా స్వీట్స్ ని పంపుతున్నాము. అంతే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా చేయబోతున్నాము. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ మాతోనే ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చారు. తమని అభిమానించే అభిమానులకు ఇంతకు మించి ఏ సెలబ్రిటీలు అయినా ప్రేమ పంచగలరా చెప్పండి. హిస్టరీ లో ఇప్పటి వరకు ఇలా ఎవ్వరూ చేయలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అంతే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ జంట అన్నదాన కార్యక్రమాలు చేయబోతున్నారో లిస్ట్ కూడా ఇచ్చారు. అందుకు సంబంధించిన ట్వీట్ ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఆంధ్ర ప్రదేశ్ లో వైజాగ్ లోని శ్రీ కనకమహాలక్ష్మి దేవాలయం , చిన్న తిరుపతి గా పిలవబడే ఏలూరు లోని ద్వారకా తిరుమల దేవాలయం , విజయవాడ లోని శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం లో అన్నదాన కార్యక్రమాలు చేయబోతున్నారు. అదే విధంగా తెలంగాణాలో చింతపల్లి లోని సాయి బాబా మందిరం , మహబూబ్ నగర్ లోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం , హైదరాబాద్ లోని హరే కృష్ణ హెరిటేజ్ దేవాలయం లో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కడెక్కడ చేస్తున్నారో ఈ క్రింది ట్వీట్ లో చూడండి.

Exit mobile version