దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో అంచనాలకు అందని వేగంతో వ్యాప్తి చెందుతోంది. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు వల్ల కేసుల సంఖ్య తగ్గుతున్నా ఆంక్షలు పూర్తిస్థాయిలో ఎత్తివేస్తే మాత్రం కేసులు పెరిగే అవకాశం ఉంది. షుగర్ తో బాధ పడేవాళ్లకు కరోనా సోకితే వాళ్లపై ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని సమాచారం. వైద్య నిపుణులు షుగర్ తో బాధ పడేవాళ్లు షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
మంచి ఆహారపు అలవాట్లను పాటిస్తే గ్లూకోజ్ లెవెల్స్ లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిన కొంతమందిలో ఇన్ ఫ్లమేషన్ వల్ల షుగర్ లెవెల్స్ పెరగవచ్చని అయితే ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే మాత్రం షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఒక్కసారిగా అలవాట్లలో మార్పులు చేసుకున్నా వ్యాయామం చేయకపోయినా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఉడికించిన గుడ్డు, పొట్టు తీయని ధాన్యాలు, జొన్నరవ్వ, ముడిబియ్యం, గోధుమ రవ్వ, ఓట్స్ జావ, రాగి ముద్ద, కిచిడి, ఆకుకూరలు, కురగాయలు తీసుకోవడంతో పాటు క్యారెట్, కీర సలాడ్లుగా తీసుకోవాలి. పుల్ల మజ్జిగ, తక్కువ వెన్న శాతం ఉన్న పాలు, పెరుగు తీసుకోవాలి.
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉన్న ధాన్యాలు, పప్పులు, అవిసె గింజలు, చియా గింజలు, ఆకుకూరలు, చేపలు గుడ్లు తీసుకుంటే మంచిది.