చిన్నారుల్లో కరోనా వైరస్ లక్షణాలివే.. ఎలా గుర్తించాలంటే..?

కరోనా సెకండ్ వేవ్ లో దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వృద్ధులు, యువతతో పాటు చిన్నారులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అయితే పిల్లలకు కరోనా వైరస్ సోకే విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. పిల్లలకు కరోనా సోకినా వాళ్లకు ఏం కాదని చాలామంది భావిస్తున్నారు. సెకండ్ వేవ్ లో 15 నుంచి 20 శాతం మంది పిల్లలు కరోనా బాధితులుగా ఉన్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ […]

Written By: Navya, Updated On : May 14, 2021 8:03 pm
Follow us on


కరోనా సెకండ్ వేవ్ లో దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వృద్ధులు, యువతతో పాటు చిన్నారులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అయితే పిల్లలకు కరోనా వైరస్ సోకే విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. పిల్లలకు కరోనా సోకినా వాళ్లకు ఏం కాదని చాలామంది భావిస్తున్నారు. సెకండ్ వేవ్ లో 15 నుంచి 20 శాతం మంది పిల్లలు కరోనా బాధితులుగా ఉన్నారు.

కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పిల్లల్లో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించడానికి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతునొప్పి, ముక్కుదిబ్బడ, వాంతి, విరేచనాలు, వేగంగా శ్వాస తీసుకోవడం, కడుపునొప్పి, రుచి, వాసన తగ్గిపోవడం, ఆకలి వేయకపోవడం కరోనా లక్షణాలు అని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా సోకిన పిల్లలకు తక్కువ లక్షణాలు ఉంటే ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు.

ఆయాసం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం లాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తే మంచిది. పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురైతే మాత్రం వెంటిలేటర్ పై చికిత్స అందజేయాల్సి ఉంటుంది. పిల్లల్లో కడుపునొప్పి, వాంతి లాంటి లక్షణాలు కనిపించినా వెంటనే చికిత్స చేయిస్తే మంచిది. కరోనా సోకిన పిల్లల్లో కొంతమంది మల్టీసిస్టమ్ ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్ సమస్యతో బాధ పడుతున్నారు.

కరోనా సోకిన పిల్లలు మంచి ఆహారం తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగడంతో పాటు ఎక్కువ సమయం నిద్రపోవాలి.