Homeఎంటర్టైన్మెంట్Varalaxmi Sarathkumar: సాయి మాధవ్ బుర్రను నమ్మించి వరలక్ష్మీ శరత్ కుమార్ మోసం చేసిందా..?

Varalaxmi Sarathkumar: సాయి మాధవ్ బుర్రను నమ్మించి వరలక్ష్మీ శరత్ కుమార్ మోసం చేసిందా..?

Varalaxmi Sarathkumar: విభిన్న తరహాలో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటిమణులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె కెరియర్ మొదట్లో అడపాదడపా హీరోయిన్ పాత్రలను పోషించినప్పటికి ఆ తర్వాత నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనదైన రీతిలో నటనను చూపిస్తూ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు ఆమెను టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. తెలుగులో క్రాక్, వీర సింహారెడ్డి, హనుమాన్ సినిమాల్లో తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఇక అలాంటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం ‘సరస్వతి’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి వరలక్ష్మీ శరత్ కుమార్ దర్శకత్వ బాధ్యతలను కూడా స్వీకరించింది… అయితే ఈ సినిమాకి ప్రముఖ రచయిత అయిన సాయి మాధవ్ బుర్ర కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. నిజానికి అతనే ఈ సినిమాను డైరెక్షన్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఈ సినిమా మొత్తాన్ని వరలక్ష్మి శరత్ కుమార్ కంట్రోల్ లోకి తీసుకుందట.

Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!

అతను ఏం కావాలన్నా కూడా తనకు నచ్చినవి మాత్రమే సమకూరుస్తూ, నచ్చనివి వదిలేస్తుందట. మొదటి సినిమా డైరెక్షన్ చేస్తున్నాడు కాబట్టి ఇది తేడా కొడితే తన కెరీర్ కి ఇబ్బంది అవుతుదనే ఉద్దేశ్యంతో ఆయన సున్నితంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నాడట. దాంతో వరలక్ష్మి శరత్ కుమార్ ఆ సినిమాని హ్యాండిల్ చేస్తూ దర్శకత్వ బాధ్యతలనైతే స్వీకరించింది.

ఇక అప్పటినుంచి ఆ సినిమా కథలో చాలా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమానైతే చేశారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడడం లేదు. ఇక దానికి తోడుగా సాయి మాధవ్ బుర్ర కి ఒప్పుకున్న రెమ్యూనరేషన్ ని కూడా ఇవ్వలేదట. మరి ఈ విషయం మీద ఆయన రీసెంట్ గా స్పందించాడు.

‘నేను రాసిన ఒకటి వాళ్ళు తీసిన కథ మరొకటి సరస్వతి అనేది కంప్లీట్ వేరు’ అంటూ ఆయన తన భావోద్వేగాన్ని సోషల్ మీడియాలో తెలియజేశాడు. ఇక దానికి తోడుగా నా కథని మానభంగం చేశారు అంటూ కూడా ఆయన పోస్ట్ లో స్పందించాడు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది… మరి ఈ వివాదం ఎక్కడ దాకా వెళుతుంది. ఈ విషయం మీద వరలక్ష్మి శరత్ కుమార్ స్పందిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version