రైతుభరోసా డబ్బులు ఖాతాలో పడ్డాయా..? లేదా..? ఎలా తెలుసుకోవాలంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఈ స్కీమ్ కింద 5,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేశారు. రాష్ట్రంలోని కొంతమంది రైతుల ఖాతాలలో ఇప్పటికే నగదు జమ కాగా మరి కొంతమంది రైతుల ఖాతాలలో మాత్రం నగదు జమ కాలేదు. అన్నదాతలు ఆధార్ నంబర్ సహాయంతో సులభంగా రైతు భరోసా నగదు జమైందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. రైతులు తమ […]

Written By: Kusuma Aggunna, Updated On : May 14, 2021 8:06 pm
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఈ స్కీమ్ కింద 5,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేశారు. రాష్ట్రంలోని కొంతమంది రైతుల ఖాతాలలో ఇప్పటికే నగదు జమ కాగా మరి కొంతమంది రైతుల ఖాతాలలో మాత్రం నగదు జమ కాలేదు. అన్నదాతలు ఆధార్ నంబర్ సహాయంతో సులభంగా రైతు భరోసా నగదు జమైందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.

రైతులు తమ ఖాతాలలో నగదు జమైందో లేదో తెలుసుకోవాలంటే రైతు భరోసా వెబ్‌సైట్‌ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. రైతు భరోసా వెబ్ సైట్ లోకి వెళ్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రైతు భరోసా డబ్బులు వచ్చాయో లేదో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైతు భరోసా పేమెంట్ స్టేటస్ ను తెలుసుకోవడం ద్వారా బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

రైతుభరోసా వెబ్ సైట్ లో నో యువర్ పేమెంట్ స్టేటస్ లో డబ్బులు జమయ్యాయో లేదో అనే వివరాలు ఉంటాయి. వెబ్ సైట్ లో కొత్త పేజ్ ఓపెన్ అయిన తరువాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే పేమెంట్ వివరాలు సులభంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. మరోవైపు మోదీ ఈరోజు 2,000 రూపాయలు ఖాతాలో జమ చేయనున్నారు. పీఎం కిసాన్ స్కీమ్ ఎనిమిదో విడత నగదు ఖాతాల్లో జమ కానుంది.

కరోనా కష్ట కాలంలో రైతుల ఖాతాలలో ఈ నగదు జమ కావడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలలో నగదు జమ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.