Vijay Controversy With Trisha: సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ల నైపుణ్యాన్ని వాడుకొని టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకున్న విజయ్ ప్రస్తుతం ఆయన టీవీకే అనే పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఇక ఈ పార్టీ ద్వారా తను తమిళనాడు సీఎంగా మారాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ వాళ్ళ భార్య అతని మీద కేసు పెట్టడం తనకు డివోర్స్ కావాలని ఫోర్స్ చేయడం అలాగే త్రిష తో అతనికి సంబంధం ఉందంటూ కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక రీసెంట్ గా విజయ్ త్రిష ఇద్దరు కలిసి ఒక పెళ్లి ఫంక్షన్ కి అటెండ్ అయిన వీడియోస్ రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో ను సైతం త్రిష నే రిలీజ్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు…
Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!
మరి వీటన్నింటిని చూస్తుంటే విజయ్ కి భారీగా బ్యాడ్ నేమ్ వస్తుంది. తను ఎందుకని ఇలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటున్నాడు. ఎందుకని సమాజానికి వ్యతిరేక పనులను చేస్తున్నాడు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక అతన్ని చూసి చాలా మంది జనాలు ఇన్స్పైర్ అయి ఒక మంచి లైఫ్ ను లీడ్ చేయాలి అనుకోవాలి. అంతే కానీ ఉన్న భార్యకు విడాకులు ఇచ్చి, వేరే వాళ్ళతో సహజీవనం చేయడం లాంటి వాటిని విజయ్ ఎంకరేజ్ చేస్తే సమాజం చెడిపోయే విధంగా మెసేజ్ ఇచ్చినవాడవుతాడు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఇక మొత్తానికైతే ఒక పథకం ప్రకారం తనను రాజకీయ రంగం నుంచి పక్కకు తప్పించాలని కొంతమంది చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఉదయ్ నిధి స్టాలిన్ ను త్రిష ఇష్టపడుతుంది. కాబట్టి ఆయన చెప్పినట్టుగానే ఆమె విజయ్ పరువు తీయడానికే ఇలా చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…
ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ ఈ వార్తలు మీద ఎలా స్పందిస్తాడు అనే విషయం మీద సరైన క్లారిటీ రావడం లేదు. కానీ మొత్తానికైతే విజయ్ ఈ విషయాల మీద ఎలా స్పందిస్తాడు. అలాగే తన పార్టీని ఎలా నిలుపుకుంటాడు…ఈ సంవత్సరం రాబోతున్న ఎలక్షన్స్ లో తన సత్తా చాటుకుని సీఎంగా మారతాడా? లేదంటే పార్టీ గెలుపోటములను చూసి ఆ పార్టీని రద్దు చేసి మళ్లీ సినిమాల్లోకి వస్తాడా? అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి…