Andhra Pradesh Egg Prices Fall 2026: ఏపీలో( Andhra Pradesh) కోడిగుడ్ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పతనం దిశగా ధర ఉంది. రోజురోజుకు వాటి ధరలు దారుణంగా పడిపోతున్నాయి. ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో భారత్ నుంచి కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ తరుణంలో గుడ్ల నిల్వలు పెరిగిపోతున్నాయి. దీంతో ధర కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. సగానికి పైగా ధర తగ్గింది. దీంతో రైతులు ఆందోళనతో ఉన్నారు. గత రెండు రోజులుగా గుడ్ల ధరలు చూస్తే రైతులు గుడ్లు తేలేస్తున్నారు. ప్రస్తుతం 100 గుడ్ల హోల్ సేల్ ధర రూ.420 గా నిర్ణయించారు. అయితే ఒక్కసారిగా గుడ్ల ధరలు పతనం కావడంతో.. పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.
Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!
* పేరుకుపోయిన నిల్వలు..
ఏపీవ్యాప్తంగా పౌల్ట్రీ లలో( poultry) రోజుకు దాదాపు 5 కోట్ల గుడ్లు ఉత్పత్తి ఉంటుంది. అయితే ఈ ఉత్పత్తిలో సగం మాత్రమే మన రాష్ట్రంలో వినియోగిస్తుంటారు. మిగిలిన కోడిగుడ్లను దేశంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఇప్పుడు గుడ్ల వినియోగం పడిపోయింది. అదే సమయంలో ఇతర దేశాలకు వెళ్లే గుడ్ల ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. పచ్చిమాస్యాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో చెన్నై పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయని చెబుతున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డును రూ.4.45 కు విక్రయిస్తున్నారు. అయితే బయట చికెన్ షాపుల్లో ఐదు రూపాయల నుంచి రూ.5.50 పైసల వరకు.. కిరాణా షాపుల్లో ఆరు రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
* భారీగా పలికిన ధర..
గత ఏడాది డిసెంబర్ నాటికి కోడిగుడ్ల ( eggs) ధరలు భారీగా పలికాయి. 100 కోడిగుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ.678 కి చేరింది. అయితే రిటైల్ గా గుడ్డును ఎనిమిది రూపాయలకు విక్రయించారు. అయితే ధర నెమ్మదిగా తగ్గింది. గత కొద్ది రోజులుగా దారుణంగా పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ధర రూ. 4.20 దర్గా చూపిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇతర రాష్ట్రాల్లో మూడు రూపాయల వరకు పడిపోయినట్లు తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. పచ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతోనే ఈ పరిస్థితి అని ఆందోళన వ్యక్తం అవుతోంది. పోర్టులతో పాటు ఎయిర్ పోర్టులు మూసివేయడంతో ఈ ఇబ్బందులు వస్తున్నాయని తెలుస్తోంది.