https://oktelugu.com/

చికెన్ తో బ్లాక్ ఫంగస్ సోకుతుందా.. అసలు విషయమేమిటంటే..?

కరోనా ఫస్ట్ వేవ్ లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందగా చికెన్ తో కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజుల నుంచి దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతుండగా చికెన్ తింటే బ్లాక్ ఫంగస్ సోకుతుందని సోషల్ మీడియాలో మెసేజ్ లు వైరల్ అవుతుండటం గమనార్హం. “కోళ్లకు బ్లాక్​ ఫంగస్​.. తస్మాత్​ జాగ్రత్త” అని సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా ఒక వార్త వైరల్ అవుతోంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 30, 2021 3:26 pm
    Follow us on

    కరోనా ఫస్ట్ వేవ్ లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందగా చికెన్ తో కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజుల నుంచి దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతుండగా చికెన్ తింటే బ్లాక్ ఫంగస్ సోకుతుందని సోషల్ మీడియాలో మెసేజ్ లు వైరల్ అవుతుండటం గమనార్హం. “కోళ్లకు బ్లాక్​ ఫంగస్​.. తస్మాత్​ జాగ్రత్త” అని సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా ఒక వార్త వైరల్ అవుతోంది.

    అయితే శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మాత్రం చికెన్ తింటే బ్లాక్ ఫంగస్ సోకదని తేల్చి చెబుతున్నారు. కరోనాతో పాటు బ్లాక్​ ఫంగస్ దేశాన్ని వణికిస్తున్న తరుణంలో కొన్నిరోజుల పాటు చికెన్ కు దూరంగా ఉండాలని ప్రచారం జరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్ రీసెర్చ్​ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ మాత్రం బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని ఈ వ్యాధి విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

    ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్​ఫంగస్​ వస్తోందని వైరల్ అయిన వార్తలో కూడా నిజం లేదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కోళ్లకు ఈ ఫంగస్ సోకినా సులువుగా గుర్తించవచ్చని ఐసీఎఆర్​ సైంటిస్ట్​ డాక్టర్ ఎంఆర్ రెడ్డి తెలుపుతున్నారు. జంతువులకు బ్లాక్​ఫంగస్​ సోకిన కేసులు నిర్ధారణ కాలేదని ఆయన చెబుతున్నారు. కోళ్లను, బాతులను ముద్దు చేయడం ద్వారా సాల్మొనెల్లా ఇన్​ఫెక్షన్ సోకుతుందని ఇది సాధారణ ఇన్ఫెక్షన్ అని వైద్యులు చెబుతున్నారు.

    ఎయిమ్స్​ డైరెక్టర్​, పల్మనాలజిస్ట్​ రణ్దీ​ప్​ గులేరియా సైతం బ్లాక్ ఫంగస్ అంటువ్యాది కాదని తెలిపారు. అయితే ఇది చాలా ప్రాణాంతకమైన ఫంగస్ ఇన్ఫెక్షన్ అని ఈ ఫంగస్ వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.